ఇక ఈ యుద్ధభూమిని వదిలి వెళ్ళండి.. ఆఫ్గనిస్తాన్ లోని భారతీయులకు ఇండియన్ కాన్సులేట్ అధికారుల సందేశం
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అతి పెద్ద నగరమైన మజారే షరీఫ్ సిటీ దిశగా అన్ని మార్గాల నుంచి వస్తున్నారని, అందువల్ల ఇక్కడి భారతీయులంతా వెంటనే ఢిల్లీ వెళ్లాలని ఈ సిటీ (మజారే షరీఫ్) లోని దౌత్య కార్యాలయ అధికారులు ఓ సందేశాన్ని విడుదల చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అతి పెద్ద నగరమైన మజారే షరీఫ్ సిటీ దిశగా అన్ని మార్గాల నుంచి వస్తున్నారని, అందువల్ల ఇక్కడి భారతీయులంతా వెంటనే ఢిల్లీ వెళ్లాలని ఈ సిటీ (మజారే షరీఫ్) లోని దౌత్య కార్యాలయ అధికారులు ఓ సందేశాన్ని విడుదల చేశారు. మంగళవారం రాత్రి ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక విమానం ఢిల్లీ బయలుదేరుతుందని..ఈ సిటీలోని. లేదా దీనికి చుట్టుపక్కల ఏ ఇండియన్ ఉన్నా వెంటనే ఆ విమానం ఎక్కాలని ఇందులో పేర్కొన్నారు. వారు తమ పూర్తి పేరును, పాస్ పోర్టు వగైరా వివరాలను వాట్సాప్ ద్వారా 0785891303 లేదా 0785891301 కి తెలియజేయాలని కోరారు. గత నెలలో ఇండియా కాందహార్ లోని తమ 50 మంది దౌత్య సిబందిని, సెక్యూరిటీ అధికారులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది. వీరిని తరలించడానికి అప్పడు కూడా స్పెషల్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో సుమారు 1500 మంది భారతీయులు ఉన్నారు. వార్ జోన్ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న భారతీయుల భద్రతకు తాము అన్ని చర్యలూ తీసుకున్నామని ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది.
అమెరికా కూడా ఆఫ్ఘన్ లోని తమ దేశీయులందరినీ వెంటనే స్వదేశానికి తిరిగి రావలసిందిగా ఈ మధ్యే కోరిన విషయం గమనార్హం. తాలిబన్లు మజారే షరీఫ్ సిటీని చేజిక్కించుకుంటే అది ఆఫ్ఘన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అవుతుంది. నిన్నటికి తాలిబన్లు ఆరు ప్రొవిన్షియల్ రాజధానులను తమ హస్తగతం చేసుకున్నారు. ఈ దేశంలోని అమెరికా బలగాల ఉపసంహరణ త్వరలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..