Kim Jong Un: నార్త్ కొరియాలో ఓ వైపు ఆకలి కేకలు.. మరోవైపు రైఫిల్ ఎక్కుపెట్టిన కిమ్ జోంగ్ ఉన్
ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రజలు తిండి లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అక్కడ అణిచివేతతో బతుకున్న దేశప్రజలకి ఇప్పుడు ఆహార సంక్షోభం రావాడంతో నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రజలు అంత ఇబ్బందులకి గురవుతున్నప్పటికీ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రజలు తిండి లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అక్కడ అణిచివేతతో బతుకున్న దేశప్రజలకి ఇప్పుడు ఆహార సంక్షోభం రావాడంతో నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రజలు అంత ఇబ్బందులకి గురవుతున్నప్పటికీ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా అతడు దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటనలు చేశారు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఆయుధ శక్తిని మరింత పెంచాలని అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. ఇటీవలే అగ్రరాజ్యం అమెరికాతో సహా దక్షిణ కొరియాణతో ఆ దేశానికి ఉద్రిక్తితలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధ ఫ్యాక్టరీల్లోని కిమ్ పర్యటించడం చర్చనీయాంశమైంది. ఇలాంటి సందర్భంలో కిమ్ అలా పర్యటనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే అక్కడ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ఇంజన్ల తయారీ కేంద్రంతో సహా ఇతర ఆయుధ ఫ్యాక్టరీలు.. గగనతల వాహనాలు. భారీ రాకెట్ లాంచర్లకు అవసరమయ్యే పనిముట్ల తయారీ కేంద్రాలను వరుసగా మూడు రోజుల పాటు కిమ్ జోంగ్ ఉన్ సందర్శించాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారిక మీడియా అయినా కేసీఎన్‌ఏ వెల్లడించింది. కిమ్ ఇటీవల పాల్గొన్న విషయాలకు సంబంధించి అనేక విషయాలను తెలిపింది. ఇదిలా ఉండగా కొన్ని ఆయుధాలను కూడా కిమ్ స్వయంగా పరిశీలన చేశారు. మరో విషయం ఏంటంటే అక్కడా మిగతా దేశాల్లాగా అనేక మీడియా ఛానళ్లు ఉండవు. కేవలం అధికారిక మీడియా మాత్రమే ఉంటుంది. అది కూడా కిమ్‌కు అనుకూలంగా వార్తలు ఇస్తుంది. కిమ్ ఎలాంటి అరచకాలకు పాల్పడ్డా కూడా అందుకు మీడియా సానుకూలంగానే స్పందిస్తుంది.
ఇదిలా ఉండగా తమ శైలికి అనుగూణంగా వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని.. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఇంజిన్లను తయారుచేయాలని కిమ్ జోంగ్ ఉన్ నిపుణులకు సూచించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. భారీగా దాడులు చేసేందకు వినియోగించే రాకెట్లను.. అత్యాధునిక క్రూయిజ్ క్షిపణిలతో పాటు ఇటీవలే నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని కూడా కిమ్ జోంగ్ ఉన్ పరిశీలించారు. అక్కడ ఉన్న పలు ఆయుధ ఫ్యాక్టరీల్లో అతడు రైఫిళ్ల పనితీరును స్వయంగా పరిశీలన చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలనే అక్కడి మీడియా విడుదల చేసింది. ఓ వైపు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు మాత్రం ఆయుధాలను పరిశీలించడం.. మరిన్ని క్షిపణులు అభివృద్ధి చేయాలని చెప్పడం గమనార్హం.



