AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

American Telugu Association: అమెరికాలో ఘ‌నంగా ‘ఆటా’ 19వ మహాసభల కిక్‌ ఆఫ్ వేడుక‌

అమెరికాలోని బాల్టిమోర్‌లో అమెరికా తెలుగు సంఘం (ATA) నిర్వహించే 19వ మహా సభల కిక్‌ ఆఫ్‌ వేడుక ఘనంగా జరిగింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

American Telugu Association: అమెరికాలో ఘ‌నంగా 'ఆటా' 19వ మహాసభల కిక్‌ ఆఫ్ వేడుక‌
Aata
Anand T
|

Updated on: Oct 30, 2025 | 8:36 PM

Share

అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహాసభలను పురస్కరించుకుని బాల్టిమోర్‌ లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన ‘ఆటా’ బాల్టిమోర్‌లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని బాల్టిమోర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్‌లోని రెనైసాన్స్‌ హార్బర్‌ ప్లేస్‌ హోటల్‌లో విజయవంతంగా జరిగింది.

కిక్‌-ఆఫ్‌ మీట్‌ విజయవంతం

ఆటా మహాసభల కిక్‌-ఆఫ్‌ ఈవెంట్‌లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్‌-ఆఫ్‌ మీట్‌ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.

ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్‌, స్థానిక ఆర్గనైజింగ్‌ టీమ్‌లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్‌వర్క్‌, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు. బోర్డు సమావేశం, కిక్‌-ఆఫ్‌ ఈవెంట్‌ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్‌ ఆర్గనైజింగ్‌ టీమ్‌, స్పాన్సర్‌లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ఆటా నాయకత్వం ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్‌గా మేరీలాండ్‌కు చెందిన శ్రీధర్‌ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్‌గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా శరత్‌ వేములను, డైరెక్టర్‌ గా సుధీర్‌ దమిడి, కో కన్వీనర్‌ గా అరవింద్‌ ముప్పిడి, కో కోఆర్డినేటర్‌ గా జీనత్‌ కుందూర్‌, కో నేషనల్‌ కో ఆర్డినేటర్‌ గా కౌశిక్‌ సామ, కాన్ఫరెన్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ తిరుమల్‌ మునుకుంట్ల, కో డైరెక్టర్‌ కిరణ్‌ అల తదితరులను నియమించింది.

అలాగే మహాసభ కోర్‌ టీమ్‌కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్‌ హాక్‌ మానిటరింగ్‌ అండ్‌ సపోర్ట్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్‌విల్లే, టెన్నెస్సీ, రఘువీర్‌ మారిపెద్ది- టెక్సాస్‌, విజయ్‌ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్‌, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్‌ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.