Viral Video: ఎవరెస్ట్ శిఖరం దగ్గర కూలిపోయిన హెలికాఫ్టర్… ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం
నేపాల్‌లో మంచు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై జారిపడి, ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్ సమీపంలోని లోబుచేలో కూలిపోయింది. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో...

నేపాల్‌లో మంచు రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, అక్టోబర్ 29 బుధవారం తెల్లవారుజామున మంచుతో కప్పబడిన హెలిప్యాడ్‌పై జారిపడి, ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మౌంట్ ఎవరెస్ట్ సమీపంలోని లోబుచేలో కూలిపోయింది. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారీ హిమపాతం కారణంగా మంచులో చిక్కుకున్న ట్రెక్కర్లను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి మంచులోకి కూలిపోతున్నట్లు వీడియలో కనిపిసత్ఉందచూపించబడింది. అదృష్టవశాత్తూ కెప్టెన్ ఖడ్కా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హెలికాప్టర్ తోకభాగం దెబ్బతిన్నదని సోలుఖుంబు జిల్లా పోలీసు చీఫ్ మనోజిత్ కున్వర్ తెలిపారు.
హెలికాఫ్టర్ కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి:
Another Pics – Nepal Helicopter Crash. pic.twitter.com/5PBshXbBBt
— Sachin Gupta (@SachinGuptaUP) October 29, 2025
