AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫుల్లు కిక్కులో పులికి లిక్కర్‌ పట్టించిన మందుబాబు… ఇది నిజమా? కాదా అనేది ఏఐ నిపుణులే తేల్చాలి

'ఫ్లూట్‌ జింక ముందు ఊదు సింహం ముందు కాదు' అని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఫ్లూట్‌ ఊదడమే కాదు.. ఏకంగా ఓ పులికి లిక్కర్‌ తాపించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌...

Viral Video: ఫుల్లు కిక్కులో పులికి లిక్కర్‌ పట్టించిన మందుబాబు... ఇది నిజమా? కాదా అనేది ఏఐ నిపుణులే తేల్చాలి
Man Feeds Alcohol To Tiger
K Sammaiah
|

Updated on: Oct 30, 2025 | 7:48 PM

Share

‘ఫ్లూట్‌ జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్‌ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఫ్లూట్‌ ఊదడమే కాదు.. ఏకంగా ఓ పులికి లిక్కర్‌ తాపించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అక్టోబర్ 4, 2025న మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌లో CCTVలో ఒక ఆసక్తికర సంఘటన రికార్డ్‌ అయింది. 52 ఏళ్ల దినసరి కూలీ రాజు పటేల్ అర్థరాత్రి వీధిలో ఓ పెద్ద పులికి లిక్కర్‌ తాపిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

సాధారణంగా ఒంటరిగా పులి కంట పడ్డామా వెంటనే దాడి చేస్తుంది. పులిని చూస్తే పిడికెడు మీసాలు ఉన్నోడు కూడా పిరికితో పరుగెత్తాల్సిందే. ఆ వ్యక్తి మాత్రం పులిని చూసి ఏ మాత్రం జంకలేదు. పైగా పులిని దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాదు దానికి లిక్కర్‌ కూడా తాగించాడు.

వీడియో చూడండి:

వైరల్‌ వీడియోలో రాజు పటేల్ అనే వ్యక్తి తెల్లవారుజాము దాకా పీకల దాకా మద్యం తాగి బయటికి వచ్చాడు. అదే మత్తులో వెళ్తుండగా అతడికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్దపులిని చూసిన రాజు పటేల్ ఏమాత్రం భయపడలేదు. దానిని దగ్గరికి తీసుకుని తలపై నిమిరాడు. పైగా తన చేతిలో ఉన్న సీసా లో ఉన్న మిగిలిన మద్యాన్ని పులికి తాగించబోయాడు. ఆ పులి కూడా తాగినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు పెంచ్ నేషనల్ పార్క్ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన తర్వాత రాజు పటేల్ ధైర్యంపై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో అది ఏఐ క్రియేషన్ అని నిపుణులు తేల్చేశారు. నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏఐ కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియడంలేదని పోస్టులు పెడుతున్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..