రూ.20 కచోరీ తింటుంటే.. రూ.20 లక్షలు కొట్టేశారు.. అయినా కచోరీ ప్లేట్ వదల్లేదు!
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. కచోరీలు తినేందుకు ఆగిన ఓ కలెక్షన్ ఏజెంట్ నుంచి ఇద్దరు దుండగులు రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. అయితే, దొంగలు బ్యాగ్‌తో పారిపోతుండగా బాధితుడు చేతిలోని కచోరీల ప్లేటును వదలకుండా వారి వెంట పరుగెత్తడం ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది.

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. కచోరీలు తినేందుకు ఆగిన ఓ కలెక్షన్ ఏజెంట్ నుంచి ఇద్దరు దుండగులు రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. అయితే, దొంగలు బ్యాగ్‌తో పారిపోతుండగా బాధితుడు చేతిలోని కచోరీల ప్లేటును వదలకుండా వారి వెంట పరుగెత్తడం ఈ ఘటనలో ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. చంపలాల్ అనే కలెక్షన్ ఏజెంట్ తన స్కూటర్‌పై వెళ్తూ కచోరీలు తినేందుకు ఓ చోట ఆగాడు. స్కూటర్‌ను పార్క్ చేసి, వాహనం ఫుట్‌బోర్డ్‌పై రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను ఉంచాడు. అదే సమయంలో హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు మరో స్కూటర్‌పై అక్కడికి చేరుకున్నారు.
అదును చూసిన దుండగులు చంపలాల్ స్కూటర్‌పై ఉన్న నగదు బ్యాగ్‌ను చాకచక్యంగా అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన చంపలాల్ వెంటనే వారిని పట్టుకునేందుకు వెంబడించాడు. అయితే, చేతిలో ఉన్న కచోరీల ప్లేటును మాత్రం వదలకుండా దొంగల వెంట పరుగెత్తాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు కాలినడకన దొంగలను వెంబడిస్తుండగా, నిందితులు స్కూటర్‌పై పారిపోయినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. చంపలాల్ ఫిర్యాదు మేరకు నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించి, వారి ఆచూకీ కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన రూ.20 లక్షల నగదు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
20 रुपए की कचौरी खाने के चक्कर में 20लाख ले उड़े चोर https://t.co/GjpsRPNN1G
— mansha maurya 🪔 (@ssksingh84) October 27, 2026
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
