AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు అలర్ట్.. APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9 వరకు అప్లై చేయొచ్చు!

APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును నవంబర్ 9, 2026 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా..

నిరుద్యోగులకు అలర్ట్.. APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9 వరకు అప్లై చేయొచ్చు!
APPSC Hostel Welfare Officer Grade II Application Deadline
Srilakshmi C
|

Updated on: Oct 28, 2026 | 3:18 PM

Share

అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. సంబంధిత నియామక ప్రక్రియకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలి. చివరి తేదీ దాటిన తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 9న ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 నవంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర నిబంధనలను పరిశీలించాలి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు

  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్‌ సర్వీస్‌): 41
  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్‌-II (ట్రైబల్ వెల్ఫేర్): 23
  • హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్): 33లి.

సోషల్ వెల్ఫేర్‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు బీఎడ్‌/బీటీ డిగ్రీ ఉండాలి. ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.) ఉండాలి. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 మధ్య ఉండాలి. అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 ప్రతి ఒక్కరూ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09-10-2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: 09-11-2026

పరీక్ష విధానం

సింగిల్-లెవెల్ ఆబ్జెక్టివ్ విధానంలో 2 పేపర్లకు ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్‌ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, ఎడ్యుకేషన్‌ పేపర్‌ 150 మార్కులకు, మొత్తం 300 నిమిషాల్లో మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీలోని 25 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

అభ్యర్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను సరిగ్గా నమోదు చేయాలి. అలాగే దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రతిని భద్రపరచుకోవా

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ II ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9వరకు అప్లై చేయండి
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9వరకు అప్లై చేయండి
అమెరికాలో తీసిన తొలి తెలుగు చిత్రం ఏదంటే..?
అమెరికాలో తీసిన తొలి తెలుగు చిత్రం ఏదంటే..?
100 సెంచరీలా.. కోహ్లీకి అంత సీన్ లేదు..: కివీస్ పేసర్
100 సెంచరీలా.. కోహ్లీకి అంత సీన్ లేదు..: కివీస్ పేసర్
బాసర ట్రిపుల్ ఐటీలో దసరా సెలవులకు బ్రేక్.. అసలు ముచ్చట ఇదే!
బాసర ట్రిపుల్ ఐటీలో దసరా సెలవులకు బ్రేక్.. అసలు ముచ్చట ఇదే!
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు షురూ
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు షురూ
దీపావళి లక్ష్మీ పూజలో పసుపు గవ్వలు, గోమతి చక్రం ఎందుకు ఉంచుతారు?
దీపావళి లక్ష్మీ పూజలో పసుపు గవ్వలు, గోమతి చక్రం ఎందుకు ఉంచుతారు?
వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో..
వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో..
లండన్‏లో చదువు మానేసి మరీ నాకోసం వచ్చాడు.. జాన్వీ కపూర్
లండన్‏లో చదువు మానేసి మరీ నాకోసం వచ్చాడు.. జాన్వీ కపూర్
అర్నబ్ తుఫాన్‌పై సీఎం యాక్షన్ ప్లాన్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫాన్‌పై సీఎం యాక్షన్ ప్లాన్.. కీలక ఆదేశాలు..!
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..