కాళ్లు లేకపోయినా మహా దాతృత్వం.. బౌద్ధ భిక్షువుకు భిక్షకుడు చేసిన దానం వీడియో చూస్తే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బిహార్‌లోని గయా మహాబోధి ఆలయం సమీపంలో కాళ్లు లేని ఒక నిరాశ్రయుడైన భిక్షకుడు, తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని, నాణేలను దారిన వెళ్తున్న ఒక బౌద్ధ భిక్షువుకు దానంగా ఇచ్చాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు సాయం చేయాలనే అతని విశాల హృదయం అక్కడివారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సుందరమైన మానవతా దృశ్యం ఇంటర్నెట్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తూ, ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది.

ప్రపంచంలో మానవత్వమే అతిపెద్ద మతం అని నిరూపించే సంఘటనలు ఎప్పుడో ఒకసారి మన కంటబడుతుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు మన మనసును హత్తుకుంటాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అలాంటి ఒక అద్భుతమైన వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. బిహార్‌లోని ప్రసిద్ధ మహాబోధి ఆలయ ప్రాంతంలో తీసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
బిహార్‌లోని గయా జిల్లాలో ఉన్న మహాబోధి ఆలయం వద్ద రోడ్డు పక్కన కాళ్లు లేని ఒక నిరాశ్రయుడైన భిక్షకుడు కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో దారిన వెళ్తున్న బౌద్ధ భిక్షువులు దాన పాత్ర పట్టుకుని రావడం ఆ వ్యక్తి గమనించాడు. వెంటనే తన జేబులో ఉన్న నాణేలను, తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసి ఆ భిక్షువు దాన పాత్రలో వేశాడు. తన దగ్గర కనీసం కాలు కూడా లేకపోయినా, పక్కవారికి సాయం చేయాలనే అతని గొప్ప మనసు అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.
బౌద్ధ భిక్షువు ఇచ్చిన బహుమతి
ఆ భిక్షకుడు చూపిన నిస్వార్థ గుణానికి ఆ బౌద్ధ భిక్షువు ఎంతగానో చలించిపోయారు. ఆ వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి, తల నుంచి టోపీ తీసి భిక్షువు చరణాలకు నమస్కరించిన ఆ నిరాశ్రయుడిని ఆశీర్వదించారు. అంతేకాకుండా, దానికి ప్రతిఫలంగా ఆ భిక్షువు తన పాత్ర నుండి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, మంచి నీళ్ల బాటిల్, కొంత నగదును ఆ వ్యక్తికి బహుమతిగా ఇచ్చారు. ఆపై అతని తలపై చేయి వేసి ఆశీర్వదించారు. ఈ దృశ్యాన్ని చూసిన మిగతా బౌద్ధ భిక్షువులు, స్థానికుల ముఖాల్లో చిరునవ్వులు వెలిశాయి.
View this post on Instagram
సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన
ఈ సుందరమైన దృశ్యాన్ని ఒక వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 36 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల భావోద్వేగాలతో కామెంట్లు పెడుతున్నారు. డబ్బు ఉన్నవాడు మాత్రమే దానం చేయలేడు, ఇవ్వాలనే గొప్ప మనసు ఉండాలి అని కొందరు రాస్తే, నిజమైన మానవత్వానికి ఇదే నిదర్శనం అని మరికొందరు ప్రశంసించారు. జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇతరులకు సాయం చేయాలనే ఈ సంఘటన అందరికీ ఒక చక్కటి పాఠం నేర్పుతోంది.




