AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ టికెట్ డ్రాలో ప్రవాస భారతీయుల అదృష్టం.. 200 గ్రాముల బంగారం గెలుచుకున్న ఆఫీస్ బాయ్!

యూఏఈలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న ఓ సాధారణ భారతీయుడి అదృష్టం ఒక్కసారిగా ప్రకాశించింది. ప్రసిద్ధ అబుదాబి బిగ్ టికెట్ ఈ-డ్రాలో ఆయన 200 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు బిస్కెట్‌ను గెలుచుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 25 లక్షలు ఉంటుంది. గత కొంతకాలంగా తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఈ భారీ విజయం అప్రూవ్‌గా తగిలింది. ఈయనతో పాటు మరో ముగ్గురు భారతీయులు కూడా ఇదే డ్రాలో గోల్డ్ బార్‌లను గెలుచుకోవడం విశేషం.

బిగ్ టికెట్ డ్రాలో ప్రవాస భారతీయుల అదృష్టం.. 200 గ్రాముల బంగారం గెలుచుకున్న ఆఫీస్ బాయ్!
Abu Dhabi Big Ticket Luck
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2026 | 7:36 AM

Share

కష్టపడి పనిచేసే వారిని అదృష్టం ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడుతుందనడానికి ప్రవాస భారతీయుల ఉదంతమే నిదర్శనం. విదేశాలలో ఉంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న కొందరు భారతీయులకు గల్ఫ్ దేశంలో ఊహించని అదృష్టం వరించింది. ప్రసిద్ధ అబుదాబి బిగ్ టికెట్ నిర్వహించిన ఈ-డ్రా లో యూఏఈలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న ఒక భారతీయుడు సహా నలుగురు ప్రవాసులు 200 గ్రాముల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్‌ను గెలుచుకున్నారు. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా.

ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న అరుణ్‌కు ఊహించని వరం

బహ్రెయిన్, యూఏఈ ప్రాంతాలలో గత కొంతకాలంగా నివసిస్తున్న అరుణ కృష్ణప్ప కిడియూర్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఆఫీస్ బాయ్‌గా జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తన స్నేహితుల బృందంతో కలిసి క్రమం తప్పకుండా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్న ఆయనకు ఈసారి ఊహించని రీతిలో అదృష్టం వరించింది. తనకు 200 గ్రాముల గోల్డ్ బార్ వచ్చినట్లు నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాను నమ్మలేకపోయానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన బహుమతిని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, తోటి స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటానని తెలిపారు.

మరో ముగ్గురు భారతీయులకూ లక్

ఈ లక్కీ డ్రాలో కేవలం అరుణ్ మాత్రమే కాకుండా మరో ముగ్గురు భారతీయులు కూడా గోల్డ్ బార్లు గెలుచుకున్నారు. ముంబైకి చెందిన ఫ్రీలాన్సర్ అయిన మనీషా, షార్జాలో నివసిస్తూ ఒంటరిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆమె ప్రయత్నం ఫలించి ఈ బహుమతిని దక్కించుకున్నారు. కేరళకు చెందిన జిజోయ్ 2007 నుంచి షార్జాలో కాంట్రాక్టింగ్ రంగంలో పని చేస్తున్నారు. పలువురు మిత్రులతో కలిసి కొన్న టికెట్‌కు ఈ బహుమతి దక్కడంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఇవి కూడా చదవండి

బెంగళూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ సదాతుల్లా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఈ డ్రాలో విజేతగా నిలిచారు. ఎప్పుడూ ఆశ కోల్పోకుండా నిరంతరం ప్రయత్నిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఈ విజేతలు అభిప్రాయపడ్డారు. ప్రవాస భారతీయుల ఈ గెలుపు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us