AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్నాబ్ తీవ్ర రూపం.. ముమ్మరమైన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ..ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్రమత్తత..!

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన అర్నాబ్ తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం నర్సాపూర్‌కు తూర్పున 30 కి.మీ, యానానికి 45 కి.మీ సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను రాబోయే 3 గంటల్లో పూర్తిగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో గంటకు 125–135 కి.మీల నుంచి గరిష్ఠంగా 150 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో స్కూళ్ల పాటు పర్యాటక ప్రాంతాలు, పాడేరు ఘాట్ రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు.

అర్నాబ్ తీవ్ర రూపం.. ముమ్మరమైన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ..ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్రమత్తత..!
Cyclone Arnab Ap
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2026 | 7:07 AM

Share

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అర్నాబ్ తీవ్ర తుఫాను గజగజలాడిస్తోంది. గత కొన్ని గంటలుగా దిశ మార్చుకుంటూ తీరానికి అత్యంత సమీపానికి చేరుకున్న అర్నాబ్ తుఫాను ప్రస్తుతం తీరం దాటే (ల్యాండ్‌ఫాల్) ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ రాబోయే 3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, ఈ భీకర తుఫాను కేంద్రం నర్సాపూర్‌కు తూర్పున కేవలం 30 కిలోమీటర్లు, యానానికి 45 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా కాకినాడకు దక్షిణ-నైరుతి దిశగా 70 కి.మీ, మచిలీపట్నానికి 90 కి.మీ, బాపట్లకు తూర్పు-ఈశాన్య దిశగా 170 కి.మీ దూరంలో పయనిస్తోంది. తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఇవి గంటకు 150 కిలోమీటర్ల గరిష్ఠ వేగానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరప్రాంతాలకు రెడ్ మెసేజ్ జారీ చేశారు. తుఫాను ధాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడుతుండటంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం రెస్క్యూ మోడ్‌లోకి వెళ్లింది.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను తాత్కాలికంగా మూసివేశారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

బాధిత జిల్లాల్లోని కలెక్టరేట్‌లు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తదుపరి అధికారిక సూచనలు జారీ చేసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us