AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్నాబ్ తుఫాన్ రెస్క్యూ మోడ్‌లో ప్రభుత్వం.. రాత్రి నుండి 4వ సారి సీఎం టెలీ కాన్ఫరెన్స్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అర్నాబ్ తుఫాన్ ప్రస్తుతం యానాం, కాకినాడ ప్రాంతాల్లో తీరాన్ని తాకుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వాతావరణ శాఖ (IMD) అధికారులతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. రాత్రి నుంచి ఇప్పటికే మూడు విడతలుగా సమీక్షించిన సీఎం, ప్రస్తుతం నాల్గవ విడత టెలీ కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు.

అర్నాబ్ తుఫాన్ రెస్క్యూ మోడ్‌లో ప్రభుత్వం.. రాత్రి నుండి 4వ సారి సీఎం టెలీ కాన్ఫరెన్స్!
Ap Cm Teleconference
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2026 | 6:50 AM

Share

తీవ్ర రూపాంతరం దాల్చిన అర్నాబ్ తుఫాన్ ఏపీ తీరప్రాంతాలపై విరుచుకుపడుతోంది. యానాం, కాకినాడ, గోదావరి జిల్లాల సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం హై అలర్ట్‌లో ఉంచింది. తుఫాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ బాధిత ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. రాత్రి నుంచి అధికారులతో మూడుసార్లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, తాజాగా నాలుగవ విడత ఉన్నత స్థాయి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో వాతావరణ శాఖ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA), అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అర్నాబ్ తుఫాన్ ప్రస్తుత స్థానం, తీరం దాటే సమయంలో వీస్తున్న పెనుగాలుల వేగం (గంటకు 120-135 కి.మీ), భారీ వర్షపాతం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎం వివరాలు సేకరించారు.

లోతట్టు, తీరప్రాంతాల నుండి ప్రజలను ఇప్పటికే సిద్ధం చేసిన పునరావాస కేంద్రాలకు తరల ప్రక్రియను పూర్తి చేయాలని, వారికి నాణ్యమైన ఆహారం, తాగునీరు, వైద్య వసతులు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి సంఘటనలు జరిగితే తక్షణమే మార్గాలను పునరుద్ధరించేందుకు NDRF, SDRF, ఫైర్ బృందాలు రంగంలోకి దిగాలన్నారు.

ఇవి కూడా చదవండి

విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తుగా మనుషుల బలగాలను, స్తంభాలను సిద్ధం చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీరప్రాంతాలకు లేదా బయటకు రావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సీఎం భరోసా ఇచ్చారు.

Follow Us