AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. ఈక్విటీలపై LTCG పన్ను రేట్లలో మార్పులు చేసే అవకాశం!

షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG Tax) విధానంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే బడ్జెట్‌కు ముందు ఈ పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం లేదా తగ్గించడంపై పరిశీలన జరుగుతోంది. ఒకవేళ ఈ పన్ను రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు పన్ను భారం తగ్గి, చేతికి అందే లాభాలు గణనీయంగా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చి చూస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. ఈక్విటీలపై LTCG పన్ను రేట్లలో మార్పులు చేసే అవకాశం!
Ltcg Tax Cut On The Cards
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2026 | 12:40 PM

Share

భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఊరటనిచ్చే వార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను రేట్లను పునర్వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌కు ముందు దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుత పన్ను విధానం ఎలా ఉంది?

ప్రస్తుత నిబంధనల ప్రకారం, 12 నెలలకు పైగా నిల్వ ఉంచిన లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అమ్మకం ద్వారా వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 లక్షల వరకు వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ పరిమితి దాటిన లాభాలపై ప్రస్తుతం 12.5 శాతం మేరకు ఎల్‌టీసీజీ పన్ను విధిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల జోరును మరింత పెంచడానికి ఈ పన్ను రేట్లను సమీక్షించాల్సిందిగా ఎస్‌బీఐ రీసెర్చ్‌తో పాటు పలు ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి సూచించాయి.

పన్ను రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు ఎంత ఆదా అవుతుంది?

ఒకవేళ ప్రభుత్వం గనుక ఎల్‌టీసీజీ పన్ను రేట్లను ప్రస్తుత ఉన్న 12.5 శాతం నుండి 10శాతం, 5శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గిస్తే, మదుపరులకు పన్ను భారం చాలా వరకు తప్పుతుంది. ఉదాహరణకు, రూ. 1.25 లక్షల మినహాయింపు పోను వచ్చే మిగతా లాభాలపై చెల్లించాల్సిన పన్ను మొత్తం భారీగా తగ్గుతుంది. రేట్లు తగ్గితే ఇన్వెస్టర్ల చేతికి వచ్చే నికర లాభాలు మెరుగవుతాయి. అంతేకాకుండా విదేశీ సంస్థాగత మదుపరులు డాలర్ల రూపంలో లెక్కించే పన్ను విధానంపై కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మదుపరులు గమనించవలసిన అంశం

ఈ మార్పులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇవన్నీ కేవలం అంచనాలు మరియు పరిశీలన దశలోనే ఉన్నందున, ఇన్వెస్టర్లు ఎప్పటిలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తమ పన్ను బాధ్యతలను లెక్కగట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో రానున్న బడ్జెట్‌లో ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us