కోహ్లీ, ధోని కాదు.. ఇన్‌స్టాలో రోనాల్డ్ ఫాలో చేసే ఏకైక భారతీయుడు ఎవరో తెలుసా..?
Cristiano Ronaldo Instagram: క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న అథ్లెట్. ఆయన ఏకంగా 679 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అయితే రొనాల్డో కేవలం 638 అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఇందులో ఒక్క భారతీయుడు మాత్రమే ఉండటం ఆసక్తికరంగా మారింది. అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Cristiano Ronaldo Instagram: ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అతనే సూపర్‌స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు ప్రస్తుతం 679 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అథ్లెట్లలో ఇదే అత్యధికం. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) 517 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 271 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
అయితే రొనాల్డో ఎవరెవరిని ఫాలో అవుతున్నాడనేది కూడా ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుతం అతను 638 అకౌంట్లను ఫాలో అవుతున్నాడు. ఇందులో ఎక్కువగా అతని ప్రస్తుత, మాజీ సహచరులు, ఫుట్‌బాల్ స్నేహితులు ఉన్నారు. రొనాల్డోకు ఇష్టమైన ఎంఎంఏ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లను కూడా అతను ఫాలో అవుతున్నాడు. అయితే రొనాల్డో ఫాలో అవుతున్న 638 అకౌంట్లలో ఒక్క భారతీయుడు మాత్రమే ఉన్నాడు. అతనే అరవింద్ శ్రీనివాస్.
కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు.. లిస్ట్‌లో తొలి ప్లేయర్‌గా నయా హిస్టరీ..!
ఎవరీ అరవింద్ శ్రీనివాస్?
చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ. రొనాల్డో ఈ సంస్థలో పెట్టుబడి కూడా పెట్టాడు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అరవింద్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. ఆయన సంపద రూ.21,190 కోట్లుగా పేర్కొనబడింది.
1994 జూన్ 7న జన్మించిన అరవింద్ ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో రెండు డిగ్రీలు పూర్తి చేశాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశాడు.
Abhishek Sharma: 4 ఫోర్లు, 6 సిక్స్‌లు.. 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ!
తన కెరీర్ ప్రారంభంలో ఓపెన్‌ఏఐ (OpenAI), గూగుల్ (Google), డీప్‌మైండ్ (DeepMind) వంటి ప్రముఖ ఏఐ సంస్థల్లో పనిచేశాడు. ఆ అనుభవంతోనే సొంతంగా పెర్ప్లెక్సిటీ ఏఐని ప్రారంభించాడు.
రొనాల్డోను అరవింద్ ఫాలో అవుతున్నాడా?
View this post on Instagram
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అరవింద్ శ్రీనివాస్‌కు 3.31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ అతను కేవలం ఒక్క అకౌంట్‌ను మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఆసక్తికరంగా ఆ ఒక్క అకౌంట్ క్రిస్టియానో రొనాల్డోది కాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




