AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 ఫోర్లు, 11 సిక్స్‌లు.. 38 బంతుల్లో అభిషేక్ ఊచకోత.. బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే పరేషానే..!

Abhishek Sharma Shatters Records: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఏకంగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

9 ఫోర్లు, 11 సిక్స్‌లు.. 38 బంతుల్లో అభిషేక్ ఊచకోత.. బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే పరేషానే..!
Ind Vs Nz 3rd T20i Abhishek Sharma Records
Venkata Chari
|

Updated on: Oct 27, 2026 | 4:36 PM

Share

Abhishek Sharma Shatters Records: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాట్‌తో సరికొత్త విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు బాదిన అభిషేక్.. ఏకంగా 297.37 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ (India) 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో బౌండరీలతో పాటు భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో తన నాలుగో టీ20 అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే భారత క్రికెట్‌లోనే కాకుండా టీ20 ఫార్మాట్‌లో పలు కీలక రికార్డులను బద్దలు కొట్టాడు.

న్యూజిలాండ్‌పై టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..

న్యూజిలాండ్‌పై ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ రెండో స్థానానికి చేరాడు.

– 13 సిక్సర్లు – రిచర్డ్ లెవి (Richard Levi), దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్, హామిల్టన్, 2012

– 11 సిక్సర్లు – అభిషేక్ శర్మ (Abhishek Sharma), భారత్ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026*

– 10 సిక్సర్లు – ఇషాన్ కిషన్ (Ishan Kishan), భారత్ vs న్యూజిలాండ్, తిరువనంతపురం, 2026

భారత బ్యాటర్‌గా ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..

భారత బ్యాటర్లలో టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా అభిషేక్ శర్మ పేరిటే ఉంది.

– 13 – అభిషేక్ శర్మ vs ఇంగ్లండ్, వాంఖడే, 2025

– 11 – అభిషేక్ శర్మ vs ఆఫ్ఘనిస్థాన్, ఢిల్లీ, 2026

– 11 – అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026*

– 10 – రోహిత్ శర్మ (Rohit Sharma) vs శ్రీలంక, ఇండోర్, 2017

– 10 – సంజూ శాంసన్ (Sanju Samson) vs దక్షిణాఫ్రికా, డర్బన్, 2024

– 10 – తిలక్ వర్మ (Tilak Varma) vs దక్షిణాఫ్రికా, జొహన్నెస్‌బర్గ్, 2024

– 10 – ఇషాన్ కిషన్ vs న్యూజిలాండ్, తిరువనంతపురం, 2026

అత్యంత వేగంగా టీ20 శతకం సాధించిన భారత బ్యాటర్లలో అభిషేక్..

పూర్తి సభ్య దేశాల మధ్య జరిగిన పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా శతకం పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో అభిషేక్ మరోసారి తన పేరును నమోదు చేశాడు.

– 8.3 ఓవర్లు – అభిషేక్ శర్మ vs ఆఫ్ఘనిస్థాన్, ఢిల్లీ, 2026

– 9.3 ఓవర్లు – అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026*

– 10.1 ఓవర్లు – అభిషేక్ శర్మ vs ఇంగ్లండ్, వాంఖడే, 2025

పురుషుల టీ20ల్లో అత్యధిక శతకాలు..

టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ అభిషేక్ శర్మ వేగంగా పైకి దూసుకొచ్చాడు.

– 22 – క్రిస్ గేల్ (Chris Gayle)

– 13 – బాబర్ ఆజమ్ (Babar Azam)

– 11 – అభిషేక్ శర్మ*

న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన టీ20 శతకం..

న్యూజిలాండ్‌పై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా శతకం సాధించిన రికార్డు ఇప్పుడు అభిషేక్ శర్మ పేరిట ఉంది.

– 35 బంతులు – అభిషేక్ శర్మ, వెల్లింగ్టన్, 2026*

– 42 బంతులు – ఇషాన్ కిషన్, తిరువనంతపురం, 2026

– 44 బంతులు – కుశాల్ పెరీరా (Kusal Perera), నెల్సన్, 2025

– 44 బంతులు – హసన్ నవాజ్ (Hasan Nawaz), ఆక్లాండ్, 2025

100కు పైగా పరుగులతో అత్యధిక స్ట్రైక్‌రేట్..

పూర్తి సభ్య దేశాల మధ్య టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనీసం 100 పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్ రికార్డుల్లో అభిషేక్ తనదైన ముద్ర వేశాడు.

– 317.64 – అభిషేక్ శర్మ vs ఆఫ్ఘనిస్థాన్, 108 (34)

– 309.30 – సికందర్ రజా (Sikandar Raza) vs గాంబియా, 133* (43)

– 303.03 – ఫిన్ అలెన్ (Finn Allen) vs దక్షిణాఫ్రికా, 100* (33)

– 297.36 – అభిషేక్ శర్మ vs న్యూజిలాండ్, 113 (38)*

– 280.55 – డేవిడ్ మిల్లర్ (David Miller) vs బంగ్లాదేశ్, 101* (36)

100+ పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో అత్యధిక రన్‌రేట్..

న్యూజిలాండ్‌పై అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కలిసి చేసిన ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.

ఈ జోడీ 18.13 రన్‌రేట్‌తో 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. పూర్తి సభ్య దేశాల మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100+ ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో ఇది అత్యధిక రన్‌రేట్‌గా నిలిచింది.

– 18.13 – అభిషేక్ శర్మ & వైభవ్ సూర్యవంశీ, భారత్ vs న్యూజిలాండ్, 2026*

– 16.08 – జోస్ బట్లర్ (Jos Buttler) & ఫిల్ సాల్ట్ (Phil Salt), ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా, 2025

– 15.00 – హషీమ్ ఆమ్లా (Hashim Amla) & ఏబీ డివిలియర్స్ (AB de Villiers), దక్షిణాఫ్రికా vs ఇంగ్లండ్, 2016

– 14.83 – షై హోప్ (Shai Hope) & ఎవిన్ లూయిస్ (Evin Lewis), వెస్టిండీస్ vs ఇంగ్లండ్, 2024

– 14.44 – అభిషేక్ శర్మ & సంజూ శాంసన్, భారత్ vs ఆఫ్ఘనిస్థాన్, 2026

38 బంతుల్లో 113 పరుగులు.. 11 సిక్సర్లు.. 35 బంతుల్లోనే శతకం.. న్యూజిలాండ్‌పై రికార్డు స్థాయి స్ట్రైక్‌రేట్.. ఇలా ఒక్క ఇన్నింగ్స్‌తోనే అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో తన విధ్వంసక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. ఈ ఇన్నింగ్స్ భారత జట్టు సిరీస్ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.

Follow Us