ఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6న అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రక్రియతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు ఈ మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల తేదీల మార్పుపై అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు దృష్టి సారించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
