International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, సంచలనాలు. టూకీగా..

ఒమన్ దేశాన్ని వరదలు, వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. షాహీన్ తుఫాను ఇక్కడ తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరం దాటకముందే ఒమన్ రాజధాని

International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, సంచలనాలు. టూకీగా..
International News
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 9:19 AM

International News: ఒమన్ దేశాన్ని వరదలు, వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. షాహీన్ తుఫాను ఇక్కడ తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరం దాటకముందే ఒమన్ రాజధాని మస్కట్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో వీధులన్నీ చెరువులు మారాయి. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇళ్లు, వాహనాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోతున్నాయి.

బాంబు పేలుడుతో కాబూల్ మరోసారి దద్దరిల్లింది. మ‌సీదు ముందు బాంబు పేలడంతో 14మంది మృతి చెందారు. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి సీరియస్‌గానే ఉంది. ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు.

మిలాన్‌ పట్టణంలో ఓ విమానం భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఫ్రాన్స్​కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.ఈ ఘటనలో అక్కడే ఉన్న కార్లు ధ్వంసమయ్యాయి. విమానం దూసుకెళ్లిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

ఇటలీలో ఓ ఐరన్ బ్రిడ్జి కాలిపోయింది. రోమ్‌ వంతెనగా పిలువబడే ఈ బ్రిడ్జ్‌పై మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు గంటల తరబడి శ్రమించారు. మంటల్ని కంట్రోల్ చేశారు.

అఫ్గనిస్తాన్ కోదమాన్‌లో తాలిబన్లు విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాలిబన్ల మద్దతుదారులు సుమారు 1500మంది పాల్గొన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో పరిపాలన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అంతా ఏకీకృతం అయ్యేందుకు కార్యాచరణ చేపట్టారు.

థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానికుల ఇళ్లు, ఆస్తులు నీట మునిగాయి. వరద బాధితులు ఇళ్లు ఖాళీ చేసి…సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వరదలో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని థాయ్‌లాండ్ వాసులు కోరుతున్నారు.

బ్రిటన్‌ని ఇంధనం కొరత వేధిస్తోంది. గత వారం రోజులుగా పెట్రోల్‌ దొరక్కపోవడంతో బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉంటున్నాయి. ఈనేపధ్యంలోనే ప్రభుత్వం 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం వినియోగిస్తోంది.

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ ప్యారిస్‌లో తళుక్కున మెరిసింది. లోరియాల్ ఫ్యాషన్‌ హంట్‌కి ఫ్యామిలీతో అటెండ్‌ అయింది ఐశ్వర్య. ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసింది. రెండేళ్ల తర్వాత ఇలా ఫ్యాషన్‌ షోలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపింది. లోరియల్ 50ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

పెళ్లి మండపానికి కారులో, బైకుపైన, గుర్రబండిలో వెళ్లే వాళ్లను చూశాం. కాని పాకిస్థాన్‌లో మాత్రం పెళ్లి చేసుకోబోతున్న ఓ నూతన జంట ఇంటి దగ్గర నుంచి పెళ్లి వేదిక వరకూ జేసీబీలో వెళ్లారు. హంజా లోయలో జరిగిన ఈ వెరైటీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ దుబాయ్ ఫేమ్ పార్క్‌లో జంతువులతో ఆటలాడాడు. అక్కడున్న జంతువులకు తానే స్వయంగా తినే పదార్ధాలను పెట్టాడు. కాసేపు వాటితో సరదాగా గడిపాడు యూవీ. అక్కడున్న ఓ ‘లైగర్‌’తో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఆడాడు. ఓ పెద్ద పైథాన్‌ని మెడలో వేసుకొని ఫోటోలు దిగి ఇన్‌స్టాలో పోస్ఠ్ చేశాడు.

Read also: Vangaveeti: ఉన్నవారినైనా కాపాడుకోండి: ఖమ్మంలో వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు