Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vangaveeti: ఉన్నవారినైనా కాపాడుకోండి: ఖమ్మంలో వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత, దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం

Vangaveeti: ఉన్నవారినైనా కాపాడుకోండి: ఖమ్మంలో వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు
Vangaveeti Radha Krishna
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 8:36 AM

Vangaveeti Radha Krishna: టీడీపీ నేత, దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన మోహనరంగా విగ్రహావిష్కరణ అనంతరం రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్లు చేశారు. “నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారు.” అని రాధా చెప్పుకొచ్చారు.

“రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే.. అన్ని వర్గాల పేదల గుండె చప్పుడు. మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం. ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లేదో గొప్పగా భావిస్తూ.. పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి.” అని రాధా ఘాటుగా స్పందించారు.

Read also: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఐదేళ్ల వరకు సెలవు. అయినా ఉద్యోగం భద్రం