AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఐదేళ్ల వరకు సెలవు. అయినా ఉద్యోగం భద్రం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఐదేళ్ల వరకు సెలవు. అయినా మీ ఉద్యోగం భద్రం అంటూ సంచలన

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఐదేళ్ల వరకు సెలవు. అయినా ఉద్యోగం భద్రం
TSRTC
Venkata Narayana
|

Updated on: Oct 04, 2021 | 8:10 AM

Share

TSRTC Bumber Offer: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఐదేళ్ల వరకు సెలవు. అయినా మీ ఉద్యోగం భద్రం అంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. సుదీర్ఘ సెలవు పెట్టాలనుకునే డ్రైవర్, కండక్టర్లకు ఈ మేరకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ స్కీం కింద అప్లై చేసుకున్న ఉద్యోగులకు ‘అసాధారణ సెలవు’ విధానం వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మీరు ఏదైనా కారణంతో విధులకు హాజరుకాలేని పరిస్థితి ఉందా.. అయితే దరఖాస్తు చేసుకోండి.. ‘అసాధారణ సెలవు’ ఇచ్చేస్తామంటూ డిపో మేనేజర్లు డ్రైవర్, కండక్టర్లకు సూచిస్తున్నారు.

తాజా ఆఫర్ తో ఆర్టీసీ ఉద్యోగులు భారీ సంఖ్యలో ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్‌ (ఈఓఎల్‌)’కు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరికొందరు మాత్రం పనీపాటా లేకుండా నెలొచ్చే సరికి జీతం వచ్చిపడుతుందికదా ఎందుకులే ఇలానే కానిద్దామన్న ఆలోచన మరికొందరు ఉద్యోగులు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయి ఉన్నారు. వీరికి పని లేకపోయినా జీతం చెల్లించాల్సిందే. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంస్థ ఆర్థిక పరిస్థితి, మిగులు ఉద్యోగుల నేపథ్యంలో ఆర్టీసీకి ఈ అసాధారణ సెలవు గుర్తొచ్చింది.

ఇలా సిబ్బంది మిగిలిపోతే ఈ సెలవు ఇవ్వచ్చని ఆర్టీసీ విధివిధానాల్లో ఉంది. గతంలో అమలు చేశారు కూడా. తర్వాత డ్రైవర్, కండక్టర్ల కొరత దృష్ట్యా దీన్ని నిలిపేశారు. కాగా, రెండేళ్ల క్రితం కార్మికుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ 1,300 అద్దె బస్సులను అదనంగా తీసుకుంది. వాటిల్లో అద్దె బస్సు యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసినందున అంత మేర సంస్థ డ్రైవర్లు మిగిలిపోయారు. ఆ వెంటనే వేయి బస్సులను ఆర్టీసీ తగ్గించుకోవటంతో మళ్లీ డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోయారు. ఇలా ప్రస్తుతం దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసీలో ఏపనీ లేకుండా ఉన్నారు.

Read also: TS Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నాల్గొవ రోజు ఎజెండా.. చర్చకు వచ్చే ప్రశ్నలు, అంశాలు ఇవీ..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది