AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నాల్గొవ రోజు ఎజెండా.. చర్చకు వచ్చే ప్రశ్నలు, అంశాలు ఇవీ..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటికి నాల్గొవ రోజుకు చేరాయి. శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే

TS Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నాల్గొవ రోజు ఎజెండా.. చర్చకు వచ్చే ప్రశ్నలు, అంశాలు ఇవీ..
Telangana Assembly
Venkata Narayana
|

Updated on: Oct 04, 2021 | 10:39 AM

Share

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటికి నాల్గొవ రోజుకు చేరాయి. శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. నాలుగో రోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నలు ముఖ్యంగా, దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్ నగరంలో దోమలు, ఈగల బెడద, వంతెనల మంజూరు, ఐటిఐని షాద్ నగర్ కు మార్చడం అంశాలు ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రెండు రోజుల విరామం తర్వాత శాసనసభ ఎనిమిదో విడత, నాలుగో రోజు సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పిస్తారు. ఇక, శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్‌ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.

స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ ఉంటుంది. శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై కూడా చర్చ జరుగుతుంది.

Read also:  Badvel By Election: బద్వేల్‌ బైపోల్‌‌లో ఊహించని పరిణామాలు.! సరికొత్త చర్చలు.. మారుతోన్న సమీకరణాలు

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు