Badvel By Election: బద్వేల్‌ బైపోల్‌‌లో ఊహించని పరిణామాలు.! సరికొత్త చర్చలు.. మారుతోన్న సమీకరణాలు

బద్వేల్‌ బైపోల్‌లో ఊహించని పరిణామాలు. ఒకరి తర్వాత మరొకరు పోటీకి దూరమయ్యారు. నిన్న జనసేన, ఇవాళ టీడీపీ. ఇద్దరిదీ ఒకటే నిర్ణయం.

Badvel By Election: బద్వేల్‌ బైపోల్‌‌లో ఊహించని పరిణామాలు.! సరికొత్త చర్చలు.. మారుతోన్న సమీకరణాలు
Badvel By Poll
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 04, 2021 | 6:51 AM

Badvel By Election: బద్వేల్‌ బైపోల్‌లో ఊహించని పరిణామాలు. ఒకరి తర్వాత మరొకరు పోటీకి దూరమయ్యారు. నిన్న జనసేన, ఇవాళ టీడీపీ. ఇద్దరిదీ ఒకటే నిర్ణయం. ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించింది తెలుగుదేశం. సానుభూతి కారణంతో వెనక్కి తగ్గింది. ఇక తేల్చాల్సింది బీజేపీనే. మొత్తానికి కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నిక ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదికైంది. మిత్రులైన బీజేపీ – జనసేన మధ్య భిన్నాభిప్రాయాలను తెరపైకి తెచ్చింది. అభ్యర్థిని ప్రకటించిన నెలన్నర తర్వాత పోటీకి దూరంగా ఉంటామన్న టీడీపీ నిర్ణయం కొత్త చర్చకు దారితీస్తోంది.

ఎమ్మెల్యే సుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక రావడం, పోటీలో ఆయన భార్య సుధ ఉండటంతో తాము పోటీ చేయడం లేదని రాజమండ్రిలో ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. జనసేన నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేయడం కొత్త కొత్త ఊహాగానాలకు తెరతీసింది. కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం కాబట్టే పోటీకి సిద్ధమన్నది సోము వాదన. ఏదైనా పార్టీ అధిష్టానం డిసైడ్‌ చేస్తుందని, 8వ తేదీ వరకు ఇంకెన్నో పరిణామాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు వీర్రాజు.

ఇదే సమయంలో ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది తెలుగుదేశం. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కూడా సానుభూతి కారణంతోనే వెనక్కి తగ్గింది. నెలన్నర కిందటే ఓబుళాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఆయన ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఉన్నట్టుడి వెనక్కి తగ్గడం రాజకీయ ఆసక్తిని పెంచింది.

నామినేషన్లకు 8వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోపు బీజేపీ కూడా డ్రాప్‌ అయితే ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా పోటీ చేస్తే పోలింగ్‌ తప్పదు. ఒకవేళ బీజేపీనే పోటీ చేస్తే జనసేన మద్దతు ఉంటుందా? గ్యాప్‌ ఇంకా పెరుగుతుందా? అన్నది కొత్త కొత్త చర్చలకు దారితీస్తోంది.

Read also: Samantha: సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మళ్లీ మార్చిన సమంత