Pawan Kalyan Live Video: దూకుడు పెంచిన జనసేనాని.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు.. (లైవ్ వీడియో)

Pawan Kalyan: ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే.. తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు.

Pawan Kalyan Live Video: దూకుడు పెంచిన జనసేనాని.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు.. (లైవ్ వీడియో)

|

Updated on: Oct 03, 2021 | 10:30 PM

Pawan Kalyan: ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోతే.. తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన తలపెట్టిన శ్రమదానం’ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుంచి మొదలుకుని.. బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు.

రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదన్న పవన్.. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే రోడ్లు లేవు, జీతాలు పెన్షన్లు రావని ఎద్దేవ చేశారు. బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగే వాడిని కాదు, గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కాపు, ఒంటరి, తెలగలు, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రాదని సూచించారు. నాలుగు కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని హితవు పలికారు. దుష్టపాలన అంతం కావాలంటే ప్రతి ఒక్కరూ ఏకం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా పనులు జరగడం లేదని పవన్ ఆరోపించారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మన హక్కు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. తొక్కే కొద్దీ పైకిలేస్తాం తప్ప.. తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు నాకు సరదా కాదు.. బాధ్యత. నేను సీఎం కావాలని మనసులో కోరుకోండి. రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. త్వరలోనే అధికారంలోకి వస్తామని వెల్లడించారు. పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదని హితవు పలికి పవన్ కళ్యాణ్.. రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదని జనసేనాని చెప్పుకొచ్చారు. వైసీపీ అల్లరి, రౌడీ మూకలను ఎదుర్కోవడం టీడీపీ వల్ల కావడం లేదన్నారు జనసేనాని. తెలుగుదేశం సత్తా సరిపోకపోవడం వల్లే జనసేన రోడ్లపైకి వచ్చిందన్నారు.


మరిన్ని చదవండి ఇక్కడ : Naga Chaitanya-Samantha Divorce: లవ్ అండ్ డివోర్స్.. ఓ విడాకుల చిత్రమ్.. అతనే కారణమంటూ నెటిజన్లు ట్రోలింగ్..(లైవ్ వీడియో)

 Samantha-Naga Chaitanya Divorce Live Video: కెరీర్ సక్సెస్ వల్ల పెర్సనల్ లైఫ్ ప్రభావితం అవుతుందా..?

 Monkey Video Viral: స్పైడర్‌మ్యాన్‌ కోతి స్టంట్స్‌..! లైక్స్ వేటలో వానరం వైరల్ వీడియో..

 Bill Viral Video: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ఎమోషనల్ బిల్లు..! వైరల్ వీడియో..

Follow us