Indian American Cop: ఈ పంజాబీ పోలీస్ ఇప్పుడు అమెరికాలో ఓ హీరో.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
పోలీస్ ఉద్యోగమంటేనే సవాళ్లతో కూడుకున్నది. అందులోనూ నిత్యం కాల్పులు, దోపిడీలు జరిగే అమెరికా లాంటి దేశాల్లో విధులు నిర్వర్తించడమంటే కత్తిమీద సామే.
పోలీస్ (Police) ఉద్యోగమంటేనే సవాళ్లతో కూడుకున్నది. అందులోనూ నిత్యం కాల్పులు, దోపిడీలు జరిగే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడమంటే కత్తిమీద సామే. ఈక్రమంలో భారతసంతతి(Indian Origin) కి చెందిన ఓపోలీస్ ను అమెరికా (America) వాసులు హీరోగా కొలుస్తున్నారు. అతను పోలీస్ ఉద్యోగంలో చేరి కేవలం ఆరు నెలలే అయినప్పటికీ అతను చూపిన ధైర్యం, తెగువను చూసి అక్కడి ప్రజలందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో, ఎందుకు హీరోగా మారాడో తెలుసుకుందాం రండి.
నిందితుడు కాల్పులు జరుపుతున్నా..
ఇటీవల ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు న్యూయార్క్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో భారత సంతతికి చెందిన 27 ఏళ్ల సుమిత్ సులెన్, జాసన్ రివెరా(22), విల్బర్ట్ మోరా(27) తో కలిసి సంఘటనా స్థలానికి బయలు దేరాడు. అయితే అక్కడకు చేరుకున్న పోలీసులపై నిందితుడు లాషాన్ మెకనీల్(47) కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో జాసన్ రివెరా ప్రాణాలు కోల్పోగా, విల్బర్ట్ మోరా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ పరిణామంతో ఊహించని షాక్ తిన్న సుమిత్ సులెన్ వెంటనే తేరుకున్నాడు. తన దగ్గరున్న తుపాకీతో నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపాడు. దీంతో ఆ సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ నిందితుని దగ్గర బంధీలుగా ఉన్న తల్లీకుమారులను సురక్షితంగా విడిపించాడు సుమిత్. కాగా నిందితుడు మెకనీల్ 50 రౌండ్ల సామర్థ్యంతో కూడిన పిస్టోల్ తో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ప్రయత్నంలోనే తన సహచరుడిని కళ్లముందే కోల్పోయాడు సుమిత్.
నా కుమారుడిని చూసి గర్వపడుతున్నాను..
కాగా ఇటీవల అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు బాగా పెరిగాయి. ఈ ఘటనకు ముందే ఈ నెలలోనే రెండు చోట్ల పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు సాయుధులు. కాగా సాయుధులు కాల్పులు జరుపుతున్నా తెగువతో ముందుకెళ్లిన భారతీయ సంతతి పోలీస్ సుమిత్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ పోలీస్ స్వస్థలం పంజాబ్. అక్కడి నుంచి వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చి స్థిరపడింది. కాగా గతేడాది ఏప్రిల్ లోనే పోలీస్ శాఖ లో ఉద్యోగం సంపాదించాడు సులెన్. అంతకుముందు న్యూయార్క్ నగరంలో ట్యాక్సీ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించాడు. కాగా సుమిత్ ను చూసి అతని తల్లి తెగ సంబరపడిపోతోంది. తనకుమారుడు చాలా మంచి పనిచేశాడని, అతనిని చూస్తుంటే గర్వంగా ఉందంటూ పొంగిపోతోంది.
#NewYork: An Indian-American police officer, who has been on the job for just over six months, is being hailed a hero for rushing to neutralise a gunman who shot a police officer and wounded another. pic.twitter.com/4Z9T9HPukI
— IANS Tweets (@ians_india) January 24, 2022
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల మాయ..కంపెనీ మెయిల్ హ్యాక్ చేసి రూ. 46 లక్షలు కొల్లగొట్టిన వైనం..
Cyber Fraud: మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. మహేశ్ బ్యాంకులోని రూ.12 కోట్లు మాయం..