AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine tension: పతాక స్థాయికి ఉక్రెయిన్‌-రష్యా వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం

United States orders: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా.

Russia-Ukraine tension: పతాక స్థాయికి ఉక్రెయిన్‌-రష్యా వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం
Us
Balaraju Goud
|

Updated on: Jan 25, 2022 | 6:59 AM

Share

Russia-Ukraine conflict: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా(America). వైట్ హౌజ్(White House) నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న దౌత్యవేత్తల కుటుంబాలను(Diplomats’ families) వెంటనే అమెరికాకు వచ్చేయాలని కోరింది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై అనేక దేశాలు స్పందించాయి. రష్యాకు వార్నింగ్‌ కూడా ఇచ్చాయి. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రష్యా. తాజాగా ఈ అంశంపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లోని దౌత్యవేత్తల కుటుంబాలను వెంటనే అమెరికాకు వచ్చేయాలని కోరింది. ఉక్రెయిన్‌ ఆక్రమణ విషయంలో రష్యా నుంచి నిరంతర ముప్పు పొంచి ఉందని సంచలన కామెంట్స్‌ చేసింది అమెరికా. రాయబార కార్యాలయంలోని సిబ్బంది కూడా వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

అంతేకాదు అమెరికా పౌరులు కూడా వీలైనంత త్వరగా బయల్దేరాలని సూచించింది వైట్‌హౌజ్. రష్యా చొరబాటుకు పాల్పడితే, తమ పౌరులను ఖాళీ చేయగలిగే స్థితిలో ఉండబోమని అంటోంది అమెరికా. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా పౌరులు ఉక్రెయిన్‌కు ప్రయాణించడంపై హెచ్చరికలు జారీ చేసింది. రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల సమీపానికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది అమెరికా.

అయితే, ఆ ప్లేస్‌లో అమెరికన్లకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులతోపాటు యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలను మోహరించింది రష్యా. ఆ దేశాన్ని ఆక్రమించేందుకే రష్యా పావులు కదుపుతోందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని రష్యా ఖండిస్తూ వస్తోంది. అయితే, అమెరికా తాజా ఆదేశాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందనే కామెంట్స్‌ బలంగా వినిపిస్తున్నాయి.

Read Also… Punjab Elections: నవజ్యోత్ సింగ్ సిద్దూపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్!