First Woman SC Judge: పాకిస్తాన్‌ చరిత్రలో తొలి అడుగు .. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌ ప్రమాణం..

First Woman SC Judge: పాకిస్తాన్‌ చరిత్రలో తొలి అడుగు .. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌ ప్రమాణం..
Ayesha Malik First Woman Supreme Court Judge Pakistan

పాకిస్తాన్‌‌లో దేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశంలో దీనిని ఒక చారిత్రాత్మక సందర్భంగా చూస్తున్నారు. రాజధాని..

Sanjay Kasula

|

Jan 24, 2022 | 10:00 PM

Pakistan First Woman SC Judge: పాకిస్తాన్‌‌లో దేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశంలో దీనిని ఒక చారిత్రాత్మక సందర్భంగా చూస్తున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాలిక్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో 16 మంది సహోద్యోగులతో కూడిన బెంచ్‌లో చేరారు. “ఇది ఒక పెద్ద అడుగు” అని న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త నిఘట్ డాడ్ AFP వార్తా సంస్థతో వెల్లడించారు. ఇదీ పాకిస్తాన్ న్యాయవ్యవస్థ చరిత్రలో పెద్ద రోజు అని వారు అభివర్ణించారు. అయేషా మాలిక్ తన విద్యను హార్వర్డ్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఆమె పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

పంజాబ్ ప్రావిన్స్‌లో పితృస్వామ్య చట్టపరమైన ఆచారాలను మార్చిన ఘనత ఆమెది. గత ఏడాది, ఆమె అత్యాచార బాధితురాలికి వివాదాస్పదమైన వైద్య పరీక్షను రద్దు చేశారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

సంప్రదాయవాద దేశంలో మహిళలు ముందుకు సాగేందుకు ఇది తొలి అడుగు..

అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో న్యాయం కోసం పాకిస్తాన్‌లోని మహిళలు తరచూ పోరాడుతున్నారు. ఈ వైద్య పరీక్ష బాధితులపై దాడి చేయడానికి.. పరువు తీయడానికి ఒక సాధనంగా ఉపయోగించబడింది. మాలిక్‌ను పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడం వల్ల ఇస్లామిక్ రిపబ్లిక్ చారిత్రకంగా సంప్రదాయవాద.. పురుష-ఆధిపత్య న్యాయస్థానంలో ప్రవేశించడానికి మరింత మంది మహిళలు మార్గం సుగమంగా మారింది. మహిళలు ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ముస్లిం దేశంగా పాకిస్థాన్‌కు పేరుంది.

లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా‌(PCL)లో ఆమె లా చదువుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని హార్వర్డ్ లా స్కూల్‌లో లా‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు న్యాయవాదిగా పనిచేశారు. 2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పాకిస్థాన్‌లోని పలు హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్ కోర్టులు, స్పెషల్ ట్రైబ్యునల్స్, ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్స్‌లలో ఆమె సేవలందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్(IAWJ) లోనూ సభ్యురాలిగా ఉన్నారు.

అయేషా మాలిక్‌ నియామకంపై వివాదం..

వృత్తిరీత్యా న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త అయిన ఖదీజా సిద్ధిఖీ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు ఉన్న అన్ని అడ్డంకులను తాను ఛేదించారని.. ఇప్పుడు ఇతర మహిళలు ముందుకు సాగడానికి అనుమతిస్తానని అన్నారు. ఇది భవిష్యత్తులో మరిన్ని మహిళా-కేంద్రీకృత నిర్ణయాలకు కోర్టులు దారితీస్తుందని ఆశిస్తున్నాను అని వెల్లడిచారు. అయితే ఆమె నియామకం గత నాలుగు నెలలుగా వివాదంలో చిక్కుకుంది.

వాస్తవానికి, ఈ స్థానానికి ఎక్కువ అర్హత ఉన్న సీనియర్ పురుష అభ్యర్థుల కంటే జస్టిస్ అయేషా మాలిక్  ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ నెల ప్రారంభంలో అయేషా మాలిక్ నామినేషన్‌కు నిరసనగా పాకిస్తాన్ బార్ కౌన్సిల్ సమ్మెకు దిగింది.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu