UNGA: శాంతి మంత్రంతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు.. దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా చూపించాలనే పాకిస్తాన్ ప్రయత్నానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించబోరని దుయ్యబట్టింది. ముంబయి..
UNGA: అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా చూపించాలనే పాకిస్తాన్ ప్రయత్నానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించబోరని దుయ్యబట్టింది. ముంబయి పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ.. శాంతికాముకులెవరూ ఆ భీకర దాడికి కుట్రలు పన్నిన వారికి ఆశ్రయం ఇవ్వబోరని దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. భారత్‌పై అసత్య ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరమన్నారు. తమ సొంత దేశంలో జరిగిన దారుణాలు, అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఇలా మాట్లాడారంటూ పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్న వ్యక్తులు.. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వబోరన్నారు.
ముంబయిలో భీకర ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరంటూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తింది భారత్. శాంతి, భద్రత, అభివృద్ధిని మాత్రమే తాము కోరుకుంటున్నామని, సీమాంతర ఉగ్రవాదం ఆగిపోయినప్పుడే అది కచ్చితంగా జరుగుతుందని భారత్ తెలిపింది. పాకిస్థాన్‌తో ఉగ్ర, హింస రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని తాము కాంక్షిస్తున్నామని మిజిటో వినిటో స్పష్టంచేశారు.
India ?? exercises its right of reply at the #UNGA
Watch?: Statement by Mr. Mijito Vinito, First Secretary ⤵️ pic.twitter.com/WJpFNRzSL6
— India at UN, NY (@IndiaUNNewYork) September 24, 2022
పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామే అనే విషయాన్ని ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ కు మరోసారి స్పష్టం చేసింది భారత్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..