Viral: ఇదేం గిన్నిస్ రికార్డు మాస్టారూ.. 17 గంటల్లో 67 పబ్‌లు.. ఏకంగా 30 లీటర్ల మందుకొట్టాడు!!

''రికార్డులలోకెల్లా.. ఈ రికార్డు వేరయా.. విశ్వదాభిరామ.. ఈ మందుబాబుకు అస్సలు ఎదురులేదురా మామ''..

Viral: ఇదేం గిన్నిస్ రికార్డు మాస్టారూ.. 17 గంటల్లో 67 పబ్‌లు.. ఏకంగా 30 లీటర్ల మందుకొట్టాడు!!
Beer
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2022 | 11:26 AM

”రికార్డులలోకెల్లా.. ఈ రికార్డు వేరయా.. విశ్వదాభిరామ.. ఈ మందుబాబుకు అస్సలు ఎదురులేదురా మామ”.. ఇంగ్లాండ్‌కు చెందిన 22 ఏళ్ల నాదన్ క్రింప్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు.! ఏంటి ఆ రికార్డు.? చాలా ఎక్కువ ఫుడ్ తిన్నాడా.? లేక లిఫ్టింగ్ చేశాడా.? లేక మరేదైనా అని మీరు అనుకోవచ్చు.! ఆగండీ.. ఆగండీ.. అతడు మందుకొట్టడంలో రికార్డు సృష్టించాడు. అది కూడా అలాంటిది.. ఇలాంటిది కాదు.. కేవలం 17 గంటల్లో 67 పబ్‌లు.. ఏకంగా 30 లీటర్ల పానీయాలు పుచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 24 గంటల్లో అత్యధిక పబ్‌లు సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. తద్వారా ఈ ఏడాది మొదట్లో 17 గంటల్లో 56 పబ్‌లను సందర్శించిన వెల్ష్‌మన్ గారెత్ మర్ఫీ రికార్డును విజయవంతంగా దాటేయగలిగాడు.

గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించేందుకు క్రింప్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తన స్నేహితులతో కలిసి ప్రతీ పబ్‌ను సందర్శించిన క్రింప్.. ఒక పబ్‌లో మద్యం.. మరో పబ్‌లో పానీయం సేవిస్తూ.. తన పోటీలో ముందుకెళ్లాడు. తాను సందర్శించిన ప్రతీ పబ్‌లో మద్యం లేదా పానీయం తాగినట్లుగా రసీదులు, sakshi సంతకాలు లాంటి సాక్ష్యాలను సేకరించాను. మొదట 25 పబ్‌లని అనుకున్నాం. అయితే ఆ సంఖ్య ప్రతీసారి పెరుగుతూ వచ్చింది. ఈ తతంగం మొత్తంలో తన ఫ్రెండ్స్ సాయం మర్చిపోలేనిదని క్రింప్ తెలిపాడు.

బీర్, బేబీ గిన్నిస్, టకీలా, లేగర్ మొదలగు పానీయాలు తాగినట్లుగా చెప్పాడు. రోజులో సుమారు 30 లీటర్ల పానీయాలు సేవించానని.. ఇక తాను ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇందులో ఇంకా చెప్పాల్సిన ఆసక్తికర విషయమేంటంటే.. 17 గంటల్లో ఎక్కువ సమయం టాయిలెట్‌లకు వెళ్లేందుకే సరిపోయిందన్నాడు. కాగా, కుక్కల ట్రస్టు కోసం నిధుల సేకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు 22 ఏళ్ల క్రింప్ వెల్లడించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..