Viral: ఆకలేసి చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది.. తీరా పార్శిల్ విప్పి చూసేసరికి..!

ఆమె ఓ చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. తీరిగ్గా కారులో కూర్చుని తినొచ్చునని అనుకుంది. పార్శిల్ కట్టించుకుని బయల్దేరింది.

Viral: ఆకలేసి చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది.. తీరా పార్శిల్ విప్పి చూసేసరికి..!
Gerogia Woman
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2022 | 1:42 PM

కారులో తన ఆఫీసుకు వెళ్తూ ఓ మహిళ ఆకలేసి.. దారి మధ్యలో ఉన్న కెఎఫ్‌సీ రెస్టారెంట్ దగ్గర ఆగింది. అక్కడ ఆమె ఓ చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. తీరిగ్గా కారులో కూర్చుని తినొచ్చునని అనుకుంది. పార్శిల్ కట్టించుకుని బయల్దేరింది. ఆమె మధ్యదారిలో పార్శిల్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాకయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే.? ఈ స్టోరీ చదవాల్సిందే.!!

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జోన్నే ఒలివర్ తన కారులో ఆఫీస్‌కు వెళ్తుండగా.. ఆకలేసి మార్గం మధ్యలో ఉన్న ఓ కెఎఫ్‌సీ రెస్టారెంట్ దగ్గర ఆగింది. ఓ చికెన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేసింది. వెళ్తూ కారులో తినవచ్చునని అనుకున్న ఆమె.. ఆ పార్శిల్ తీసుకుని బయల్దేరింది. ఇక మార్గం మధ్యలో తినేందుకు పార్శిల్ ఓపెన్ చేయగా.. దెబ్బకు షాక్ అయింది. ఆమెకు సుమారు 543 డాలర్ల క్యాష్ దొరికింది. దాన్ని చూడగానే ఒక్కసారిగా కంగుతిన్నది.

ఇక అంత డబ్బు చూడగానే ఎవ్వరైనా కూడా తమ దగ్గరే పెట్టుకోవాలని చూస్తారు. కానీ ఈమె మాత్రం నిజాయితీగా వ్యవహరించి.. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించింది. ఆ మొత్తాన్ని వారికి అప్పగించింది. ఇక ఒలివర్ చేసిన మంచి పనిని మెచ్చిన సిటీ ఆఫ్ జాక్సన్ పోలీస్ డిపార్ట్మెంట్.. ఆమె ఫోటో, స్టోరీని తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి.. సదరు యువతిని మెచ్చుకున్నారు. కాగా, గతంలోనూ ఇలా డబ్బు దొరకగానే.. నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వారు చాలామంది ఉన్నారు. ఆ వార్తలు నెట్టింట వైరల్‌గా మారిన సందర్భాలు లేకపోలేదు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..