China Army: చైనా సైనికులకు చుక్కలు చూపిస్తున్న హిమాలయాలు.. మావల్ల కాదంటున్న డ్రాగన్ సోల్జర్స్..

China Army: ఎల్ఏసీ ఇండియా చైనా సరిహద్దు రేఖ అనే విషయం తెలిసిందే. ఎల్ఏసీలో వేలాది అడుగుల ఎత్తైన శిఖరాల మధ్య, మంచు మైదానాలు, నడవడానికి కూడా వీల్లేని..

China Army: చైనా సైనికులకు చుక్కలు చూపిస్తున్న హిమాలయాలు.. మావల్ల కాదంటున్న డ్రాగన్ సోల్జర్స్..
China

China Army: ఎల్ఏసీ ఇండియా చైనా సరిహద్దు రేఖ అనే విషయం తెలిసిందే. ఎల్ఏసీలో వేలాది అడుగుల ఎత్తైన శిఖరాల మధ్య, మంచు మైదానాలు, నడవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉంటాయి. అయితే, విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. నిరంతరం ఎల్ఏసీలో కుట్రలు చేస్తూ వస్తోంది. అందులో బాగంగానే ఎల్ఏసీలో తమ బలగాలను భారీగా మోహరిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలను భారీగా తరలిస్తోంది. అయితే, చైనా కుట్రలకు ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ప్రకృతి మాత్రం చైనాకు చుక్కలు చూపిస్తోంది.

ఎల్ఏసీలో పీఎల్ఏ సైనికుల సాహసాలు అంటూ చైనా ఎన్ని వీడియోలు విడుదల చేస్తున్నా.. వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయట. హిమాయ పర్వతపంక్తులలో చైనా సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోందట. అక్కడి మీడియా నివేదిక ప్రకారం.. లడఖ్‌లో అతి తీవ్రమైన చలి.. పీఎల్ఏ జవాన్లకు మరణశాసనంగా మారిందట. పర్వత ప్రాంతాల్లో తీవ్రమైన చలి, ఆక్సీజన్ స్థాయిలు తక్కువగా ఉండటం చైనా సైనికుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందట. ఒకరి తరువాత ఒకరుగా సైనికులు, కమాండర్లు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పీఎల్ఏ జనరల్ జాంగ్ జుండాంగ్ అనారోగ్యానికి గురైన వార్త.. దీనిని ధృవీకరిస్తోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. పీఎల్ఏ జనరల్ జాంగ్ జుడాంగ్ మరణించాడు. జుడాంగ్.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు ఇష్టమైన, విశ్వసనీయ జనరల్స్‌లో ఒకరుగా గుర్తింపు పొందాడు. ఈ కారణంగానే అతను పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కమాండర్‌గా నియమించబడ్డాడు. ఇతని నేతృత్వంలోని దళం లడక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్ఏసీలో కుట్రలు చేయడంలో దిట్ట. జాంగ్ జుడాంగ్ డిసెంబర్ 2020 లో కమాండర్‌గా నియమించబడగా.. కేవలం 6 నెలల్లోనే పవి నుంచి వైదొలిగాడు. ఈ ఏడాది జూన్‌లో తన పదవి నుంచి తప్పుకున్నాడు. కారణం.. హిమాలయాల్లోని కఠినమైన పరిస్థితులను తట్టుకోలేకపోవడమేనట. హిమాలయాల్లోని వాతావరణ పరిస్థితుల కారణంగా జుడాంగ్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా జుడాంగ్ ప్రాణాలు వదిలాడు. ఇక జుడాంగ్ తరువాత వచ్చిన జనరల్ షు కిలింగ్‌ పరిస్థితి కూడా అలాగే ఉందట. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన కిలింగ్.. రోజుల వ్యవధిలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో కమాండర్ బాధ్యతలను వాంగ్ హైజియాంగ్‌కు అప్పగించింది చైనా ప్రభుత్వం.

లడఖ్‌లోని ఎల్ఏసీలో చైనా 50 వేలకు పైగా సైన్యాన్ని మోహరించింది. కానీ, వారెవరూ లడఖ్ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. యువాన్ వాంగ్ మిలిటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు జౌ చెన్మింగ్ ప్రకారం.. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అధికారులు, సైనికులు గుండె, కడుపుకి సంబంధించిన తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారట. ఫలితంగా పీఎల్ఏ సిబ్బంది తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారట.

వాస్తవానికి చైనా సైనికులకు శీతల వాతావరణంలో యుద్ధం చేసే సామర్థ్యం లేదు. కానీ, భారత సైన్యం పూర్తి భిన్నం. భారత సైన్యం కేవలం లడఖ్‌లో మాత్రమే కాదు.. కార్గిల్, సియాచిన్ వంటి ఎత్తైన, మంచుతో నిండిన ప్రాంతాల్లో కూడా ఒక రాయిలా నిలుస్తోంది. అది భారత సైనికు బలం, ధైర్యం, సామర్ధ్యం. ఈ కారణంగానే మన దేశ సరిహద్దులు రక్షితంగా ఉంటాయి. ముఖ్యంగా లడఖ్ నుండి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా ఎన్ని కుట్రలు చేస్తున్నా పని చేయకపోవడానికి ఇదే కారణం.

Also read:

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ ప్యాకేజీ

AP-TS Weather Report: అరేబియా సముద్రంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu