South Africa Women : ఆ దేశంలో మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండొచ్చట..! కారణం ఏంటో తెలుసా..?
South Africa Women : ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒక ప్రతిపాదనకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇక్కడి మహిళలు ఒకరి
South Africa Women : ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒక ప్రతిపాదనకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇక్కడి మహిళలు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండటానికి చట్టపరమైన అనుమతి కోరుతున్నారు. దక్షిణాఫ్రికాలో పురుషులు ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మహిళలకు కూడా ఈ హక్కును ఇవ్వడానికి పరిశీలిస్తున్నారు. కొంతమంది ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను దక్షిణాఫ్రికా హోం శాఖ పరిశీలిస్తోంది. దీనిని గ్రీన్ పేపర్‌లో చేర్చాలని డిమాండ్ ఆ దేశ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇది వివాహాలను మరింత కలుపుకుంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. సంప్రదాయ నాయకులే కాకుండా వివాహ విధానాన్ని మరింత ధృడంగా మార్చడానికి ప్రభుత్వం అనేక మానవ హక్కుల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఒకటి కంటే ఎక్కువ వివాహం చేసుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలని మానవ హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా ఈ హక్కు పొందాలని చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత ఉదారవాద రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. స్వలింగ వివాహానికి ఇక్కడ గుర్తింపు ఉంటుంది. ఇది కాకుండా ఎవరైనా జెండర్ మారినా అతనికి పూర్తి హక్కులు లభిస్తాయి. ప్రసిద్ధ వ్యాపారవేత్త మూసా మసెలెకుకు నలుగురు భార్యలు ఉన్నారు. కానీ ఈ డిమాండ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది దక్షిణాఫ్రికా సంస్కృతిని నాశనం చేస్తుందని అంటున్నారు.
‘మహిళలు పురుషుల స్థానాన్ని భర్తీ చేయలేరు’ స్త్రీలు ఎప్పుడూ పురుషుల స్థానాన్ని భర్తీ చేయలేరని మోసెస్ మసెలె అంటున్నారు. ‘మహిళలు ఇప్పుడు పురుషుల కోసం లోబోలా చేస్తారా?’ అని ప్రశ్నించారు. లోబోలా అంటే ఒక రకమైన వధువు ధర. ఇప్పటికే దక్షిణాఫ్రికా పొరుగు దేశమైన జింబాబ్వేలో ఈ పద్దతి ఉంది. ప్రొఫెసర్ కాలిన్స్ మచోకో దీనిపై పరిశోధనలు చేసినట్లు బిబిసి తెలిపింది. ఇలాంటి వివాహాల్లో మహిళలు తరచూ చొరవ తీసుకుంటారని పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణంగా పురుషులు తమ భార్య రెండో వివాహానికి అంగీకరిస్తారు.దక్షిణాఫ్రికాలో మహిళలకు ఒకటి కంటే ఎక్కువ భర్తలు ఉండాలనే ప్రతిపాదన ఒక పత్రంలో చేర్చబడింది. ఈ పత్రాన్ని గ్రీన్ పేపర్ అంటారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దీనిని జారీ చేసింది. 1994 తరువాత దేశంలో వివాహ చట్టాన్ని సంస్కరించడానికి ఈ చర్య తీసుకున్నారు.