Anushka Shetty: ‘బాధలను పోగొట్టేవారితో ఉండండి.. కన్నీళ్లు తెప్పించే ప్రతి క్షణంతో కనెక్ట్ అవ్వండి’ అంటున్న అనుష్క శెట్టి..

అనుష్క శెట్టి.. పెదలపై చిరునవ్వుతో.. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు

Anushka Shetty: 'బాధలను పోగొట్టేవారితో ఉండండి.. కన్నీళ్లు తెప్పించే ప్రతి క్షణంతో కనెక్ట్ అవ్వండి' అంటున్న అనుష్క శెట్టి..
Anushka Shetty
Follow us

|

Updated on: Jun 29, 2021 | 2:33 PM

అనుష్క శెట్టి.. పెదలపై చిరునవ్వుతో.. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేకుండా ఉంది అనుష్క. కెరీర్ పై… వ్యక్తిగత విషయాలపై ఎలాంటి రూమర్స్ వచ్చిన సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ అనుష్కకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రచ్చ జరగలేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న అనుష్క.. సోషల్ మీడియా వేదికగా.. కొన్ని విషయాలకు మాత్రమే స్పందిస్తుంటారు.

తాజాగా స్వీటీ చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆలోచనలు కలిగిస్తుంది. అందరూ ప్రేమగా ఉండండి.. మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. మీరు ఏమని ఫీల్ అవుతున్నారో చెప్పండి. అతిగా స్పందిస్తున్నారని మీరేమి బాధపడకండి. అలా ఎక్కువగా చూపించండి. ఎక్కువ జాగ్రత్తగా చూసుకోండి. ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని మీరు నిరుపించండి. మీలోని భావాలను చెప్పేందుకు భయపడకండి. ప్రతి విరహంలోనూ మంచిని.. బ్యూటీని వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. గతంలో జరిగిన వాటి గురించి తలుచుకుంటూ చింతించకండి. కొత్త ఆరంభాలను స్వాగతించండి. మీ స్నేహితులను హత్తుకోండి. మీ బాధలను పోగొట్టేవారితో ఉండండి.. మీరు మీతో ప్రతి అంశంతో కనెక్ట్ అయి ఉండండి. బాధలను పోగొట్టే ప్రతి అంశంతో కనెక్ట్ అవ్వండి. మిమ్మల్ని ఎక్కువగా ఫీల్ అయ్యేలా చేసే వారితో కనెక్ట్ అవ్వండి. కన్నీళ్లు తెప్పించే మూమెంట్స్ తో కనెక్ట్ అవ్వండి. మీలో ఎనర్జీ నింపి మీ చేతులు కాళ్లు కదిపేలా చేసే అంశాలను తలచుకుని మీ లైఫ్ ఎంత బాగుందో గుర్తు చేసుకోండి. దయచేసి కనెక్ట్ అయి ఉండండి. ప్రపంచంలో అందమైనవి కనుమరుగవుతున్నాయి. అలా మీ హృదయాన్ని కూడా ఓ భాగం అవ్వకుండా చూసుకొండి అని చెప్పుకొచ్చారు.

Also Read: Karthika Deepam: పెళ్ళికి సాక్ష్యులుగా సౌందర్య, దీపలు రావాల్సిందేనని మోనిత వార్నింగ్.. నేనో చిత్తుకాగితాన్ని అంటున్న కార్తీక్

Ram Gopal Varma: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం