Ram Gopal Varma: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం

Ram Gopal Varma : శివ వంటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఒరవడి నేర్పించాడు.. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చి చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం
Ram Gopal Varma
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2021 | 11:12 AM

Ram Gopal Varma : శివ వంటి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఒరవడి నేర్పించాడు.. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చి చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం అలవాటు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్లు చేయడం.. ట్రెండింగ్‌లో ఉండటం.. వర్మకు అలవాటు. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. వర్మ తాను తీసే సినిమాలతో కంటే.. తన నోటికి పని చెప్పి.. వివాదాస్పద కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా వర్మ తన మరణం గురించి .. ఎలా మరణించాలని అన్న విషయం గురించి సంచలన కామెంట్స్ చేశాడు.

పుట్టినవాడు మరణించక తప్పదు.. మరణించిన వాడు మళ్లీ పుట్టక తప్పదు.. అని భగవద్గీత లో శ్రీ కృష్ణుడే చెప్పాడు. అటువంటి చావు గురించి ప్రత్యేకంగా ఆలోచించాలా అంటున్నాడు వర్మ. తన చావు కూడా ఎంత గ్రాండ్ గా ఉండాలో కూడా చెప్పి.. తాను ఇందులోనూ ప్రత్యేకత ఉందని చెప్పకనే చెప్పాడు. పుట్టిన మనిషి ఎప్పటికైనా ఎన్నేళ్ళకైనా మరణించడం తప్పదు.. కనుక.. వచ్చే మరణం గురించి భయపడుతూ… బాధపడడం వేస్ట్ అంటూ ఫిలాసఫీ చెప్పాడు ఆర్జీవీ.

కాబట్టి ఈ చావు గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. తన వరకు వస్తే ఏదైనా అణుబాంబు పేలుతున్న సమయంలో నేను దాన్ని చూస్తూ చనిపోవాలి అంటూ తెలిపాడు వర్మ. అంతేకాదు అణుబాంబు పేలుతుంటే.. అది చూస్తూ తాను మరణించాలని కోరుకుంటున్నల్టు చెప్పాడు. తనకు అసలు ఎప్పటి నుంచో అణుబాంబు పేలుతుంటే చూడాలని కోరికని అంటున్నాడు. వర్మ చావు కోరిక విన్న అభిమానులు దట్ ఈజ్ ఆర్జీవీ.. అలా కోరికలు కోరలన్నా. బయటకు దైర్యంగా చెప్పాలన్నా ఒక్క ఆర్జీవీ కె సాధ్యం అంటున్నారు.

Also Read: ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి తయారీ విధానం.. తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌