SBI Savings Account : ఎస్బీఐలో అకౌంట్ తెరిస్తే బీమా తీసుకోవాలా..! బ్యాంకు అధికారులు ఏం చెబుతున్నారు.. తెలుసుకోండి..

SBI Savings Account : కరోనా మహమ్మారి సమయంలో బీమా కవరేజ్ గురించి అందరు దృష్టి సారిస్తున్నారు.

SBI Savings Account : ఎస్బీఐలో అకౌంట్ తెరిస్తే బీమా తీసుకోవాలా..! బ్యాంకు అధికారులు ఏం చెబుతున్నారు.. తెలుసుకోండి..
Sbi
Follow us
uppula Raju

|

Updated on: Jun 29, 2021 | 2:35 PM

SBI Savings Account : కరోనా మహమ్మారి సమయంలో బీమా కవరేజ్ గురించి అందరు దృష్టి సారిస్తున్నారు. చాలా కంపెనీల బీమా పాలసీలలో చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పటికీ బీమా పాలసీకి సంబంధించి జనాలకు చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే అన్ని బ్యాంకులు బీమా పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీమా పథకానికి సంబంధించి ఖాతాదారులకు చాలా సందేహాలు ఉన్నాయి.

ఎస్బిఐలో పొదుపు ఖాతా తెరిచేటప్పుడు ప్రమాదవశాత్తు రూ.1000 బీమా చేయడం తప్పనిసరా.. కాదా? అని ఒక వినియోగదారు ఎస్బీఐని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. అంతేకాదు ఇక్కడి బ్యాంకు అధికారులు తప్పకుండా బీమా చేయాలని అంటున్నారని చెప్పాడు. ఆ బ్యాంకు శాఖ పేరు కూడా ప్రస్తావించాడు. దీనికి సంబంధించి ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా ఆ కస్టమర్‌కి ఈ విధంగా సమాధానం చెప్పింది.

బ్యాంక్ ఏమి చెప్పింది? వినియోగదారుడి ప్రశ్నకు ప్రతిస్పందించిన ఎస్బీఐ ప్రియమైన కస్టమర్ బీమా, ఇతర పెట్టుబడులను ఎంచుకోవడం పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మా శాఖలు, అధికారులు వినియోగదారుల ప్రయోజనం, అవగాహన కోసం మాత్రమే సమాచారాన్ని అందిస్తాయని తెలిపింది. అంటే మీరు ఎస్బిఐలో ఎలాంటి ఖాతా తెరుస్తున్నా బీమా తీసుకోవడం తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా సమస్యలు తెలియజేస్తున్న కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. పర్సనల్ విషయాలను పోస్ట్ చేయడాన్ని నిషేధించింది. మీరు ట్విట్టర్ ద్వారా బ్యాంక్ నుంచి సమాచారం పొందాలనుకుంటే బ్యాంకు విధించిన నిబంధనలను పాటించాలని సూచించింది. వాస్తవానికి చాలా మంది సోషల్ మీడియా ద్వారా బ్యాంక్ నుంచి సహాయం కోరినప్పుడు లేదా ఫిర్యాదు చేసినప్పుడు వారు తమ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు నంబర్, ఆధార్ కార్డు వివరాలను సోషల్ మీడియా పోస్టులలో షేర్ చేస్తారు. బ్యాంక్ ప్రకారం వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ పోర్టల్‌లో షేర్ చేయకూడదు. కస్టమర్ ఖాతాకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అవి దుర్వినయోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. తరువాత ఖాతాకు సంబంధించి ఏదైనా మోసం జరిగితే బ్యాంకు దానికి బాధ్యత వహించదని స్పష్టం చేస్తుంది.

Bladderwort Plant : మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే

Anushka Shetty: ‘బాధలను పోగొట్టేవారితో ఉండండి.. కన్నీళ్లు తెప్పించే ప్రతి క్షణంతో కనెక్ట్ అవ్వండి’ అంటున్న అనుష్క శెట్టి..

Moderna Covid 19 Vaccine: భారతదేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్.. దిగుమ‌తి అనుమతులు కోరుతూ సిప్లా ద‌ర‌ఖాస్తు!