Shar Dubey: ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్ మహింద్రా..
Anand Mahindra lauds Shar Dubey: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు. ఆన్‌లైన్ డేటింగ్ గేమ్‌ను
Anand Mahindra lauds Shar Dubey: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు. ఆన్‌లైన్ డేటింగ్ గేమ్‌ను మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీగా తిర్చిదిద్దిన ఇంజనీర్ శర్మిష్ట దూబేపై మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మహీంద్రా.. టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టంపై న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇలా వ్రాశారు. ”ఒప్పుకోవాలి, నేను ఆమె గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. భారతీయ సంతతికి చెందిన సీఈఓల జాబితాలో ఆమె పేరు తరచుగా రాదు.. ఎందుకంటే ఆమె నాయకత్వం వహిస్తున్న కంపెనీలు మ్యాచ్ మేకింగ్ సైట్లు?” కారణం అంటూ పేర్కొన్నారు. టిండెర్ ప్రపంచంలోనే అత్యంత అత్యంత ప్రజాదరణ పొందిన డేటింగ్ యాప్ అని పేర్కొన్నారు. అందుకే ఆమె (షార్ దూబే).. ప్రపంచ దృష్టిలో పడటానికి అర్హురాలంటూ ఆనంద్ మహీంద్రా అన్నారు.
టెక్సాస్ నిర్బంధ అబార్షన్ చట్టంపై స్పందించిన CEOలలో దూబే కూడా ఉన్నారు. టెక్సాస్ ఆధారిత కార్మికులు, రాష్ట్రం వెలుపల సంరక్షణను కోరుకునే వారిపై ఆధారపడిన వారికి మద్దతు ఇవ్వడానికి ఆమె ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం టెక్సాస్ ఆరు వారాల గర్భధారణ తర్వాత అబార్షన్లపై నిషేధం విధించింది. “కంపెనీ సాధారణంగా మా వ్యాపారానికి సంబంధించినది తప్ప రాజకీయ వైఖరిని తీసుకోదు. కానీ ఈ సందర్భంలో, నేను వ్యక్తిగతంగా, టెక్సాస్‌లో ఒక మహిళగా మౌనంగా ఉండలేను” అని దూబే మెమోలో పేర్కొన్నారు.
Have to admit,this is the first time I’ve learned about her. Is she not often cited in the lists of global Indian-origin CEOs because the companies she leads are matchmaking sites? Tinder is the world’s most popular dating app. It’s a behemoth. She deserves to be in the spotlight https://t.co/IU2ivZDSOI
— anand mahindra (@anandmahindra) December 28, 2021
శర్మిష్ట దూబే గురించి.. దుబే 1970లు, 1980లలో జంషెడ్‌పూర్‌లో పుట్టి పెరిగారు. ఆమె 1993లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె సుందర్ పిచాయ్ క్లాస్‌మేట్. గ్రాడ్యుయేషన్ తర్వాత.. దూబే తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఓహియో స్టేట్ యూనివర్శిటీలో చదువుకునేందుకు ఆమె డబ్బు కోసం ఒక సంవత్సరం పాటు స్టీల్ కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి దూబే ఎంఎస్ పట్టా పొందారు.
ఆమె 2006లో Match.comలో చేరారు. ప్రెసిడెంట్ ఆఫ్ మ్యాచ్ గ్రూప్ అమెరికాస్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆఫ్ మ్యాచ్ వంటి బహుళ సంస్థకు సేవలు అందించారు. ఆమె 2017లో టిండర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమితులయ్యారు. ఆ తర్వాత జనవరి 1, 2018న ఆమె మ్యాచ్ గ్రూప్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.2019 లో ఆమె గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో చేరారు. 2020లో షార్ దూబే మ్యాచ్ గ్రూప్ CEOగా నియమితులయ్యారు.
Tinder, Match.com, Meetic, OkCupid, Hinge వంటి ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ సేవల అతిపెద్ద గ్లోబల్ పోర్ట్‌ఫోలియోను మ్యాచ్ గ్రూప్ నిర్వహిస్తుంది. మొత్తం మీద 45 గ్లోబల్ డేటింగ్ కంపెనీలను మ్యాచ్ గ్రూప్ నిర్వహిస్తోంది.
Also Read: