Jahnavi Dangeti: నాసా స్పేస్‌ ప్రోగ్రాంలోకి ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా..

Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి అనే బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్‌ ఆపరేషన్స్ కెన్నడీ స్పేస్‌..

Jahnavi Dangeti: నాసా స్పేస్‌ ప్రోగ్రాంలోకి ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 27, 2021 | 12:55 PM

Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి అనే బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్‌ ఆపరేషన్స్ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏఎస్పీ)లో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా జాహ్నవి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జాహ్నవి ఇప్పటికే కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో వ్యోమగామిగా జీరో గ్రావిటీ, అండర్‌ రాకెట్‌ లాంచ్, ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపడం వంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసింది. అంతేగాక ‘టీమ్‌ కెన్నెడీ’ మిషన్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించనుంది.

ఇదిలా ఉంటే జాహ్నవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. చిన్ననాటి నుంచి అంతరిక్ష రంగంపై ఆసక్తితో ఉండే జాహ్నవి ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా బీటెక్‌ చేయడానికి పంజాబ్‌లోని ఎల్‌పీయూ యూనిర్సిటీలో చేరింది. సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలో నాసా లాంచ్‌ ఆపరేషన్స్‌ కెనడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాంకు జరిగిన ఎంపికల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్‌లో రెండు సార్లు ఇంటర్వ్యూలు చేసిన అనంతరం జాహ్నవిని ఎంపిక చేశారు. ఇలా జాహ్నవితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 మంది ఎంపికయ్యారు. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా జాహ్నవి నిలిచింది. అంతరిక్ష రంగంలో అత్యున్నత స్థానానికి చేరడమే తన లక్ష్యమని చెబుతోన్న జాహ్నవి.. సివిల్‌ పైలట్‌గా స్థిర పడాలనేది తన ఉద్దేశమని చెబుతోంది.

Jahnavi Dangeti 1

Also Read: UP Elections: ఒకే బాణంతో అనేక లక్ష్యాలు.. కస్‌గంజ్‌ ర్యాలీలో మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు..!

Vangaveeti Radha: నన్ను చంపడానికి రెక్కీ.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు.. లైవ్ వీడియో

News Watch: కృష్ణ- గోదావరి, బోర్డుల తీరుపై కేంద్రం గుస్సా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్