Singer V birthday: కొరియన్ పాప్ సింగర్ వీ పుట్టిన రోజు వేడుకలు.. భారత్ ఫ్యాన్స్ చేసిన మంచి పని తెలిస్తే.. వావ్ అనకుండా ఉండలేరు..
Singer V birthday: కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సాంగ్స్ చూసేవారికి సుపరిచితం ప్రముఖ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS. బీఎంఎస్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన అతిపెద్ద..

Singer V birthday: కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సాంగ్స్ చూసేవారికి సుపరిచితం ప్రముఖ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS. బీఎంఎస్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన అతిపెద్ద మ్యూజిక్ బ్యాండ్. BTS (“బియాండ్ ది సీన్” కోసం) అని పిలువబడే బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడిప్పుడే భారత లో కూడా ఈ బ్యాండ్ కు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఈ బ్యాండ్ లోని ఒక గాయకుడు ‘V’ తన 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. వి పుట్టినరోజు అభిమానులకు చాలా ప్రత్యేకంగా మారింది. దీంతో అతని ఫోటోను బుర్జ్ ఖలీఫాలో ప్రదర్శించారు. అభిమానులు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. వి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభినులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
V ఫర్ మ్యాప్ ఆఫ్ ది సోల్: దుబాయ్ వేదికగా అభిమానులు వీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. గాయకుడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. మూడు నిమిషాల వాణిజ్య ప్రకటన ఇన్నర్ చైల్డ్ పాటతో ప్లే చేయబడింది. V ఫర్ మ్యాప్ ఆఫ్ ది సోల్: 7 నేపథ్యంలో పాటలు పాడారు. ఈ వీడియోలోకొందరు అభిమానులు కూడా ఈ పాట పాడుతూ కనిపించారు. అయితే వీ పుట్టిన రోజు వేడుకలను గత ఏడాది కూడా ఇదే తరహాలో అభిమానులు నిర్వహించారు.
V పుట్టినరోజు సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న BTS అభిమానులు నిధుల సేకరణ, ప్రకటనలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలో కూడా, BTS అభిమానులు ఈ ప్లాన్ చేసారు. భారతీయ BTS ఫ్యాన్ క్లబ్ Bangtan_India జిన్ , V పుట్టినరోజులను పురస్కరించుకుని నిధులను సమీకరణ నిర్వహించింది. సుమారు ₹1,05,008 సేకరించింది. విరాళముగా వచ్చిన ఈ డబ్బులను మహిళలను ప్రోత్సహించే NGOకి విరాళంగాఇవ్వనున్నారు.
మరోవైపు భారతీయ అభిమానులకు V, Taehyung_india_ (ట్విట్టర్ హ్యాండిల్) ”వి”పుట్టినరోజు ప్రకటనలను ప్రదర్శించడానికి కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో కొన్ని హోర్డింగ్‌లను అద్దెకు ఇచ్చింది.
ఇక మరోవైపు వీ స్వదేశం దక్షిణ కొరియాలోని అభిమానులుపుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాజెక్ట్‌లను చేపట్టారు. వి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోలను పంచుకున్నాడు. అయితే ఈ నెల మొదట్లో బీటీఎస్‌కు కొంత కాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. వి తన కుటుంబంతో కలిసి హవాయికి వెళ్ళాడు. అక్కడ లవులను ఎంజాయ్ చేస్తున్నాడు. హవాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండి స్నేహితులను కలవడానికి వెళ్లాడు. BTS కొత్త ప్రాజెక్ట్ ప్రకటన కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
At Burj Khalifa Happy Birthday V ?????.
Thank you so much Masternim @KIMTAEHYUNGBAR_#Happyvday #HappyBirthdayTaehyung pic.twitter.com/XYqleAUrLm pic.twitter.com/ZcnGUU0KrF
— Visual Representative of Kpop V (@SweeTAENightOST) December 29, 2021
Also Read: కమల్ హాసన్ తర్వాత ఉత్తమ నటుడు అవార్డు పొందిన ఉదయ్ కిరణ్.. 33 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు




