Uday Kiran: కమల్ హాసన్ తర్వాత ఉత్తమ నటుడు అవార్డు పొందిన ఉదయ్ కిరణ్.. 33 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు
Uday Kiran: సినీ వినీలాకాశంలో చిన్న వయసులోనే నేలరాలిన ధృవతార ఉదయ్ కిరణ్. తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడుగా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ 5 జనవరి 2014న..
Uday Kiran: సినీ వినీలాకాశంలో చిన్న వయసులోనే నేలరాలిన ధృవతార ఉదయ్ కిరణ్. తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడుగా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ 5 జనవరి 2014న హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ తో పాటు ఆర్థిక ఇబ్బందులవలన ఉదయ్ తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. సోగ్గాబుగ్గలతో క్యూట్ లుక్స్ తో యువత మదిదోచిన ఉదయ్ కిరణ్ టాలీవుడు లో చిత్రం సినిమాతో అడుగు పెట్టాడు. తన సినీ కెరీర్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. కమల్ హాసన్ తర్వాత ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడైన నటుడుగా ఉదయ్ రికార్డ్ సృష్టించాడు.
ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రం, సెకండ్ మూవీ నువ్వు నేను , థర్డ్ మూవీ మనసంతా నువ్వే వరసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. వరస మూడు చిత్రాలు హిట్ అవ్వడంతో.. “హ్యాట్రిక్ హీరో” అనే బిరుదును తెచ్చిపెట్టాయి. అయితే ఉదయ్ కు మళ్ళీ ఆ రేంజ్ లో హిట్స్ దక్కలేదు.. దీంతో మెల్లగా కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఒక్కసారిగా వచ్చిన హిట్స్ .. కెరీర్ లో ఒక స్థాయిని.. మళ్ళీ ఉదయ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ హీరోగా మారడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. వరస వైఫల్యాలను ఎదుర్కోవడం ఉదయ్‌కు కష్టంగా మారడంతో డిప్రషన్ లోకి వెళ్ళాడు.. అదే అతని మరణానికి కారణమైంది.
ఉదయ్ కిరణ్ 22 ఏళ్ల వయసులో.. మెగా స్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి వరకూ వెళ్ళలేదు.. అనంతరం ఉదయ్ కిరణ్ తన స్నేహితురాలు విషితను అక్టోబర్ 24, 2012న వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఉదయ్ తన జీవితానికి ఆత్మహత్య అనే చివరి పేజీ లిఖియించుకున్నాడు.
కాలేజీలో మోడలింగ్:
ఉదయ్ కిరణ్ కాలేజీలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించాడు. 1999లో ఇంగ్లీష్ చిత్రం మిస్టీరియస్ గర్ల్‌తో సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే 2000లో ఉదయ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు.
2013లో చివరి సినిమా: ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్. ఈ మూవీ 2013లో తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక సమీక్షకుడు ఉదయ్ నటన గురించి వ్యాఖ్యానిస్తూ “బుగ్గలపై సొట్టలతో ప్రేమికుడి నుండి కండలు తిరిగిన వ్యక్తిలా.. ఉదయ్ కిరణ్ నటుడిగా రూపాంతరం చెందాడు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటనను నానా పటేకర్‌తో పోల్చవచ్చని రాశాడు.
Also Read: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఇంటి వద్దకే ప్రసాదం.. ఎలా పొందాలంటే..
సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..