- Telugu News Entertainment Tollywood RRR Movie Cast and Crew Photos starring Ram Charan jr. NTR Alia Bhatt Ajay Devgn
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ తారాగణం వీరే.. అన్నీ పాత్రలు అద్భుతంగా చెక్కిన జక్కన్న..
టాలీవుడ్ సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.
Updated on: Dec 30, 2021 | 12:20 PM

టాలీవుడ్ సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి. బాహుబలి సినిమా తర్వాత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. దాదాపు రెండేళ్లుగా జక్కన ఈ సినిమాను చెక్కుతున్నాడు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించనున్నాడు రాజమౌళి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇందుకోసం చరణ్ చాలా కసరత్తు చేశాడు. అల్లూరిగా చరణ్ ఇమిడిపోయారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. కొమురం భీమ్ గా తారక్ గెటప్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

అలాగే ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ అందాల భామ అలియా భట్ నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ సరసన నటిస్తుంది.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగే పోరాట యోధుడిగా అజయ్ కనిపించనున్నాడు.

అజయ్ సతీమణిగా అందాల భామ శ్రియ నటిస్తున్నారు. ఈ సినిమా శ్రియ పాత్రకూడా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.

ఇక విలక్షణ నటుడు సముద్రఖని ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపంచనున్నాడు. అయన పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండనుంది.

వీరితోపాటు హాలీవుడ్ నటులు.. ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. బ్రిటీష్ యువరాణిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

అలాగే నెగిటివ్ పాత్రలో, బ్రిటీష్ అధికారి పాత్రలో మరో హాలీవుడ్ నటుడు రాయ్ స్టవ్ సన్ నటిస్తున్నారు. ఆయన పాత్రకూడా సినిమాలో చాలా కీలకంగా ఉండనుందట.




