Mohan Babu Home Tour: కలెక్షన్‌ కింగ్ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. సకల సౌకర్యాలున్న ఈ ఇంటి నిర్మాణం వెనక..

Mohan Babu Home Tour: ఇటీవలి కాలంలో హోమ్‌ టూర్‌కు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ఈ జాబితాలోకి మంచు లక్ష్మీ కూడా వచ్చి చేరారు. గతంలో తన ఇంటి గురించి...

Mohan Babu Home Tour: కలెక్షన్‌ కింగ్ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. సకల సౌకర్యాలున్న ఈ ఇంటి నిర్మాణం వెనక..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2021 | 11:47 AM

Mohan Babu Home Tour: ఇటీవలి కాలంలో హోమ్‌ టూర్‌కు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ఈ జాబితాలోకి మంచు లక్ష్మీ కూడా వచ్చి చేరారు. గతంలో తన ఇంటి గురించి వివరిస్తూ లక్ష్మీ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. ఇక తాజాగా లక్ష్మీ తన తండ్రి మోహన్‌బాబు హోమ్‌ టూర్‌ వీడియోను విడుదల చేశారు. ఇప్పటి వరకు మోహన్ బాబు తన జీవితంలో మొత్తం 6 ఇళ్లను నిర్మించారు. అందులో ఒక ఇంటి వీడియోను లక్ష్మీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేశారు. పట్టణానికి దూరంగా నిర్మించుకున్న ఈ ఇల్లును చూస్తే ఇంధ్రభవనాన్ని తలపిస్తోంది.

మిని థియేటర్‌ నుంచి మొదలు జిమ్‌, స్టీమ్‌ రూమ్‌, గార్డెన్‌ ఏరియా, చిన్నారుల ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం ప్రత్యేక రూమ్‌, ఇలా సకల సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించారు. ఇంటిలోని అన్ని ప్రదేశాలను చూపించిన లక్ష్మీ మోహన్‌ బాబు గదిని మాత్రం చూపించలేరు. కూతురు విద్యా నిర్వాణతో కలిసి ఇల్లంతా సందడి చేశారు లక్ష్మీ. ఇక వీడియో ముగిసే సమయంలో మంచు లక్ష్మీ తెలిపిన కొన్ని విషయాలు ఆకట్టుకుటున్నాయి. తన తండ్రి మోహన్‌ బాబు విజయ ప్రస్థానాన్ని గురించి లక్ష్మీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.. ‘మొదుగులపాలెం ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి నేను ఏదో సాధించాలి, నాది ఇది కాదు, అనుకొని.. వచ్చిన ఆ ఒక్క మనిషి (మోహన్‌ బాబును ఉద్దేశిస్తూ) ఆ గ్రామం నుంచి బయటకు వచ్చి తన స్వయం కృషితో ఇంత నిర్మించారు.

ఇది తలుచుకున్నపుడల్లా నేను ఎమోషన్‌ అవుతాను. మా నాన్నను ఏది అడిగే హక్కు నాకు లేదు. ఇంత పేరు, విద్య, ప్రఖ్యాత అన్నీ ఇచ్చారు. దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే నా మీద ఉంది. మా నాన్న గురించి చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూస్తున్న వారిలో ఒక్కరు ప్రేరణ పొందిన తనకు గర్వకారమణని తెలిపిన లక్ష్మీ.. కృషి ఉంటే ఏదైనా సాధింవచ్చని, అందరూ విజయాన్ని అందుకోవాలని, ఇంతకంటే పెద్ద ఇళ్లను నిర్మించుకోవాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్‌.. గర్వంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌..

Coronavirus: ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్లు సునామీ సృష్టిస్తున్నాయి.. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన..