Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్‌.. గర్వంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌..

అమలా పాల్.. తెలుగులో నటించింది త‌క్కువ సినిమాలైనా పాపులారిటీ మాత్రం బాగా సంపాదించింది. ముఖ్యంగా మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది

Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్‌.. గర్వంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌..
Follow us

|

Updated on: Dec 31, 2021 | 5:46 AM

అమలా పాల్.. తెలుగులో నటించింది త‌క్కువ సినిమాలైనా పాపులారిటీ మాత్రం బాగా సంపాదించింది. ముఖ్యంగా మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. అయితే సినిమా కెరీర్‌ పిక్‌లో ఉండగానే దర్శకుడు ఏ.ఎల్. విజయ్‌తో పెళ్లిపీటలెక్కింది. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువకాలం నిలవలేదు. దీంతో అతని నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మ అరుదైన గౌరవం పొందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే గోల్డెన్‌ వీసాను అందుకుందీ అందాల తార.

కాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న అమల..’ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, గౌరవంగానూ భావిస్తున్నాను. దేశంతో పాటు అక్కడి ప్రజలందరూ నిజాయతీగా ఉంటారు. ఈ గౌరవం అందించినందుకు దుబాయ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. ఈ గోల్డెన్‌ వీసాను తాజాగా టాలీవుడ్‌ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. క్రియేటివిటి, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్య సంపద తదితర రంగాల్లో సేవలందిస్తున్న వారికి దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందిస్తుంది. ఈ వీసాతో ఆ దేశంలో ఎంతకాలమైనా ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా నివాసం ఉండే వీలుంటుంది. ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్‌ శెట్టి, సోనూ నిగమ్‌, నేహా కక్కర్‌, మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, బోనీ కపూర్‌ కుటుంబం ఈ వీసా పొందింది. కాగా దక్షిణాదిలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, టోవినో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష ఈ వీసాను అందుకున్నారు . తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా ఈ గౌరవం దక్కించుకుంది. ఇక క్రీడా విభాగంలో సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ దంపతులు కూడా ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

Also read:

Youtube: యూజర్లకు యూట్యూబ్‌ షాక్‌.. ఇకపై అలా చేయాలంటే పైసలు కట్టాల్సిందే..

New Zealand: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కివీస్‌ స్టార్‌ ఆటగాడు..

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..