AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube: యూజర్లకు యూట్యూబ్‌ షాక్‌.. ఇకపై అలా చేయాలంటే పైసలు కట్టాల్సిందే..

మనలో చాలామందికి బోర్‌ కొడితేనో, కాస్త తీరిక సమయం దొరికితేనో  మొదట చేసే పని యూట్యూబ్‌ ఓపెన్‌ చేయడం. మనకిష్టమైన వీడియోలను కావాల్సినంతసేపూ చూసే సౌలభ్యం ఇందులో ఉంటుంది

Youtube: యూజర్లకు యూట్యూబ్‌ షాక్‌.. ఇకపై అలా చేయాలంటే పైసలు కట్టాల్సిందే..
Basha Shek
|

Updated on: Dec 30, 2021 | 9:10 AM

Share

మనలో చాలామందికి బోర్‌ కొడితేనో, కాస్త తీరిక సమయం దొరికితేనో  మొదట చేసే పని యూట్యూబ్‌ ఓపెన్‌ చేయడం. మనకిష్టమైన వీడియోలను కావాల్సినంతసేపూ చూసే సౌలభ్యం ఇందులో ఉంటుంది. అందుకు తగ్గట్లే సినిమాలకు సంబంధించిన టీజర్లు, పాటలు, ట్రైలర్లు యూట్యూబ్‌లోనే విడుదలవుతుంటాయి. సాధారణంగా మనం వీడియోలను వీక్షించడమే కానీ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అయితే డేటా స్పీడ్‌లో సమస్యలున్నప్పుడు, ఇతర కారణాలతో కొంతమంది వాటిని ఆఫ్‌లైన్‌ మోడ్‌లో వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. తీరికదొరికినప్పుడు వాటిని చూస్తుంటారు. ఇందులో ఉన్న ప్రయోజనాలేంటంటే.. ఇలా ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వీడియోలకు ఇంటర్నెట్‌ తో సంబంధం లేదు. ప్రకటనలు కూడా ఉండవు. పైగా ఎన్నిసార్లయినా వీటిని చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి యూట్యూబ్‌ షాకిచ్చింది.

సాధారణంగా లో, మీడియం, హై, ఫుల్‌ హెచ్‌డీ.. ఇలా ఎలాంటి క్వాలిటీ వీడియోలైనా ఉచితంగా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం.. హై, ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇకపై కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే ప్రతి నెలా సబ్‌స్ర్కిప్షన్‌ డబ్బులు కట్టాలన్నమాట. యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో లో, మీడియం క్వాలిటీ వీడియోలను మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యముంది. అయితే యూట్యూబ్‌ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పోస్ట్‌ చేస్తున్నారు. కాగా యూట్యూబ్‌ లో ఇప్పటికే యాడ్ ఫ్రీ గా వీడియోలు చూడాలంటే.. నెల నెలా స‌బ్‌స్ర్కిప్షన్‌ తీసుకోవాలని నిబంధ‌న తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మరి కొంతమందిని సబ్‌స్క్రిప్షన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకొందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Also Read:

Disha Patani: హీరోయిన్‌ అవుతానని కలలో కూడా అనుకోలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ..

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..