Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

బాలీవుడ్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల కరీనా కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో అర్జున్‌ కపూర్‌ కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది.

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2021 | 8:33 AM

బాలీవుడ్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల కరీనా కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో అర్జున్‌ కపూర్‌ కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవవాలని కోరాడీ హీరో. అర్జున్‌తో అతని సోదరి అన్షులా కపూర్‌ కూడా మహమ్మారి బారిన పడింది. అలాగే కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న రియా కపూర్‌, ఆమె భర్త కరణ్‌ బూలానీ కూడా కొవిడ్‌ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని రియా సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ‘ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేషన్‌లో ఉంటున్నాం. వైద్యులు సూచించిన మందులు తీసుకుంటున్నాం’ అని రియా పేర్కొంది.

అర్జున్‌ ఇంటినీ సీజ్‌ చేసిన బీఎంసీ.. కాగా అర్జున్‌ ప్రేయసి మలైకా అరోరా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు నెగెటివ్‌ అని తేలింది. వీరిద్దరూ ఇటీవల ఓ డిన్నర్‌ డేట్‌కి వెళ్లారని తెలుస్తోంది. ఇక అర్జున్‌ తండ్రి, నిర్మాత బోనీకపూర్‌, హీరో అనిల్‌కుమార్‌లకు కూడా నెగెటివ్‌ అని తేలింది. కాగా కపూర్‌ ఫ్యామిలీలో ఒకేసారి నలుగురికి కరోనా సోకడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలోని అర్జున్‌ కపూర్‌ ఇంటిని సీజ్‌ చేసింది. ఇంటిపరిసరాలన్నింటినీ శానిటైజ్‌ చేసింది. కాగా ఈ హీరో కరోనా బారిన పడడం ఇది రెండోసారి. గతేడాది సెప్టెంబర్‌లో మొదటిసారి కొవిడ్‌కు గురయ్యాడు.

Also Read:

Upasana: ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా అందుకుని గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు..(వీడియో)

Big Alert: కొత్త ఏడాదిలో షాకివ్వనున్న గ్యాస్ ధరలు? జనవరి 1న కీలక నిర్ణయం..!

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే