- Telugu News Photo Gallery Business photos Reliance JIO Introduces new year offer for year here full details
Jio New Year Offer 2022: వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. అదిరిపోయే ఆఫర్‌పై ఓ లుక్కేయండి..
Jio New Year Offer 2022: కొత్తేడాది సందర్భంగా జియో తన యూజర్లకు సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వార్షిక ఆఫర్‌లో భాగంగా వ్యాలిడిటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
Updated on: Dec 30, 2021 | 1:06 PM

ఇటీవల రీఛార్జ్ ప్లాన్స్‌ను పెంచేసి యూజర్లను ఒక్కసారిగా షాకింగ్‌కి గురి చేసిన జియో. కొత్తేడాది వినియోగదారులకు ఊరటనిస్తూ ఓ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

న్యూఇయర్ కానుకగా జియో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. యూజర్లను ఆకర్షించే క్రమంలో వార్షిక ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ఆఫర్ కేవలం జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఆఫర్ పూర్తి వివరాల విషయానికొస్తే.. రూ. 2,545తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఆఫర్ వ్యాలిడిటీ 336 రోజులే ఉండగా, ప్రస్తుతం కొత్త ఆఫర్‌లో భాగంగా 365 రోజులు అందిస్తోంది.

ఈ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

వీటితోపాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సావన్ లాంటి జియా యాప్స్‌ను కూడా యూజర్లు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.




