AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

సినిమా పరిశ్రమలో ఈ ఏడాది మరో జంట విడిపోయింది. తమిళ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమ్మాన్‌ తన సతీమణి మోనికా రిచర్డ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు.

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..
Basha Shek
|

Updated on: Dec 30, 2021 | 7:52 AM

Share

సినిమా పరిశ్రమలో ఈ ఏడాది మరో జంట విడిపోయింది. తమిళ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమ్మాన్‌ తన సతీమణి మోనికా రిచర్డ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికీ సమంత, నాగచైతన్యలు విడాకుల వ్యవహారంపై చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇమాన్‌ తన 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ జంట గతేడాది నవంబర్‌లోనే విడాకులు తీసుకుంది. అయితే ఇద్దరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన విడాకుల విషయాన్ని వెల్లడించాడు ఇమ్మాన్‌.

అప్పుడే విడిపోయాం.. ‘ఇన్నేళ్లుగా మాపై ప్రేమాభిమానాలు, మద్దతు చూపిస్తున్న శ్రేయోభిలాషులకు, సంగీత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మోనికా రిచర్డ్, నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలం కాదు. మీడియాతో పాటు అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా సహకరిస్తున్నారని ఆశిస్తున్నాం. అదేవిధంగా జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలకు మరోసారి ధన్యవాదాలు’ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు ఇమ్మాన్‌.

కాగా ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా పనిచేసే మోనికాని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. అయితే అనూహ్యంగా 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ అందరికి షాకిచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 2002లో విజయ్‌, ప్రియాంక చోప్రా జంటగా నటించిన ‘తమిజన్‌ చిత్రంతో’ సంగీత దర్శకుడిగా మారాడు ఇమ్మాన్‌ . పలు హిట్‌ సినిమాలకు బాణీలు సమకూర్చారు. విజయ్‌తో పాటు విక్రమ్, అజిత్‌, ఆర్య, ధనుష్‌, విజయ్ సేతుపతి, జయం రవి తదితర  స్టార్‌ హీరోల సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అజిత్‌ హీరోగా నటించిన ‘విశ్వాసం’ చిత్రానికి గాను జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక ఇటీవల రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘అన్నాత్తే(తెలుగులో పెద్దన్న)’ సినిమాకు సంగీతం అందించాడు.

View this post on Instagram

A post shared by D.Imman (@immancomposer)

Also read:

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

Shyam Singha Roy: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా..?

Upasana: ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా అందుకుని గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు..(వీడియో)

చదువు మానేసి వ్యాపారంలోకి.. నేడు దేశంలోనే 6వ ధనవంతుడు!
చదువు మానేసి వ్యాపారంలోకి.. నేడు దేశంలోనే 6వ ధనవంతుడు!
అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక వేదన
అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక వేదన
నటుడి విషాద గాథ.. ఈయన మేనకోడలు స్టార్ హీరోయిన్..
నటుడి విషాద గాథ.. ఈయన మేనకోడలు స్టార్ హీరోయిన్..
మాటతో మెప్పించి టాప్ 5వరకు.. సంజన రెమ్యునరేషన్ ఎంతంటే..
మాటతో మెప్పించి టాప్ 5వరకు.. సంజన రెమ్యునరేషన్ ఎంతంటే..
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం