AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : మాస్ రాజా మూవీ షూటింగ్ క్లైమాక్స్.. త్వరలోనే గుమ్మడికాయ కొట్టనున్న ఖిలాడి టీమ్..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో దూసుకుపోతున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో.

Ravi Teja : మాస్ రాజా మూవీ షూటింగ్ క్లైమాక్స్.. త్వరలోనే గుమ్మడికాయ కొట్టనున్న ఖిలాడి టీమ్..
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2021 | 7:26 AM

Share

Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో దూసుకుపోతున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు రవితేజ. ఇక ఇప్పుడు ఖిలాడీ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. రమేష్ వర్మ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఖిలాడీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది. వీరులైనంత వేగంగా ఈ పాటను షూట్ చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన రెండు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో సింగిల్ ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి సందడి చేయనున్నారు. కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్.. సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి కనిపించనున్నారు. అలాగే  రావు రమేశ్ .. ఉన్ని ముకుందన్ .. మురళీ శర్మ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు