RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..
Ram Charan
Follow us
Rajitha Chanti

| Edited By: Venkata Chari

Updated on: Dec 29, 2021 | 10:06 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో  తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌తో మరో సెన్సెషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్  వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

నార్త్ టూ సౌత్.. అన్ని భాషల్లో ఈసినిమా ప్రమోషన్స్ జరుపుతున్నారు జక్కన్న అండ్ టీం. ఈ క్రమంలో భాషల వారీగా ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ముంబైలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ గత రెండుమూడ్రోల క్రితం తమిళనాడులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ఈరోజు కేరళలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు భారీగా విచ్చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేరళలో రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. చెర్రీకి సంబంధించిన భారీ పోస్టర్స్, ఫోటోస్‌తో ‘రామ్ చరణ్’, ‘జై చరణ్’ అంటూ నినాదాలు చేస్తూ భారీగా ప్రీరిలీజ్ వేడుక వద్దకు చేరుకున్నారు. ఇప్పటివరకు మన తెలుగు హీరోలలో అల్లు అర్జున్‏కు కేరళలో ఎక్కువగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీకి ఉన్న క్రేజ్ ను మించి రామ్ చరణ్ ఫాలోయింగ్ పెరిగినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Also Read: Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే