Shyam Singha Roy: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా..?

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ధియేటర్స్ లో సందడి చేస్తుంది.

Shyam Singha Roy: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా..?
Nani
Follow us

|

Updated on: Dec 30, 2021 | 7:05 AM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ధియేటర్స్ లో సందడి చేస్తుంది. నాని సాలిడ్ హిట్ చూసి చాలా కాలం అయ్యింది. గత రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కావడం అవికూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో నాని అభిమానులు నిరాశపడ్డారు. ఇక రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాతర్లో నటించి ఆకట్టుకున్నాడు. నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి నటించారు. అలాగే మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియిన్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి అలరించారు. దర్శకుడు రాహుల్ పునః జన్మ ల నేపథ్యంను చాలా చక్కగా చుపించాడని అంటున్నారు. ఇక ఈ సినిమా విమర్శకులను ప్రశంసలు దక్కుతున్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతుంది. మరో వైపు అమెరికాలోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ ఇప్పుడే సినిమాను ఓటీటీకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా  తెలుస్తుంది. కానీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ  సింగరాయ్ సినిమాను కొనుగోలు చేశారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ భారీ ఎత్తున అంచనాలు ఉన్న నేపథ్యంలో కొందరు థియేటర్లలో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి లో మొదటి వారంలో కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నయాని టాక్

మరిన్ని ఇక్కడ చదవండి :

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..