Disha Patani: హీరోయిన్‌ అవుతానని కలలో కూడా అనుకోలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ..

Disha Patani: హీరోయిన్‌ అవుతానని కలలో కూడా అనుకోలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ..

సాధారణంగా సినిమా పరిశ్రమలోని చాలామంది తారలు డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చెబుతుంటారు. అయితే తను మాత్రం ఇండియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ కాబోయి నటినయ్యానంటోంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటాని

Basha Shek

|

Dec 30, 2021 | 8:39 AM

సాధారణంగా సినిమా పరిశ్రమలోని చాలామంది తారలు డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యామని చెబుతుంటారు. అయితే తను మాత్రం ఇండియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ కాబోయి నటినయ్యానంటోంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటాని. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘లోఫర్’ సినిమాతో పరిచయమైందీ ముద్దుగుమ్మ. ఆతర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఎం.ఎస్‌.ధోని.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భాగీ 2’, ‘భాగీ 3’ ‘భారత్‌’, ‘మలంగ్‌’ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. చివరిగా సల్మాన్‌ఖాన్‌తో ‘రాధే’ చిత్రంలో సందడి చేసింది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటే ఈ సొగసరి నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా తన సినిమా కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది దిశా. అందులో తను నటి కావడానికి దారి తీసిన పరిస్థితులను పంచుకుంది. ‘ నేను నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. నేను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పైలట్‌ అవ్వాలన్నది నా లక్ష్యం. ఆ దిశగానే విద్యాభ్యాసం సాగించాను. అయితే ఇంజినీరింగ్‌ చదువుతుండగా నా స్నేహితులు కొందరు మోడలింగ్‌ గురించి చెప్పారు. మొదట పెద్దగా ఆసక్తి లేకపోయినా ఆ తర్వాత ఫ్యామిలీపై ఆధారపడకుండా స్వతంత్ర్యంగా జీవిద్దామని మోడలింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్నాను. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా కిరీటం గెల్చుకున్నాను. ఆతర్వాత మళ్లీ పుస్తకాలు పట్టుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో మోడలింగ్‌లోనే స్థిరపడిపోయాను. ఆతర్వాత సినిమాల్లో అడుగుపెట్టాను’ అని తన కెరీర్‌ గురించి చెప్పుకొచ్చింది. కాగా దిశా సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా సేవలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం దిశా మూడు సినిమాల్లో నటిస్తోంది. ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’, ‘యోధా’ సినిమాల్లో నటిస్తున్న ఈ హాట్‌ బ్యూటీ.. రామ్‌చరణ్‌- గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. Also Read:

New Zealand: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కివీస్‌ స్టార్‌ ఆటగాడు..

D Imman: సినిమా ఇండస్ట్రీలో మరో డివోర్స్‌.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌..

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu