Nivetha Thomas: బాలయ్య స్టెప్పు వేయడం అంత ఈజీ కాదు బ్యూటీ.. నివేద ఫన్నీ డాన్స్
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
Nivetha Thomas: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపించాడని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇది. అంతే కాకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డులను కొల్లగొట్టింది ఈ సినిమా. బాలయ్య నటనే కాదు డాన్స్ ల్లోనూ దుమ్ముదులుపుతాడన్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య కుర్రహీరోలకు పోటీగా అదిరిపోయే స్టెప్పులేసి అలరిస్తుంటారు. ఇక అఖండ సినిమాలోనూ తమన్ మ్యూజిక్ కు స్టెప్పులు ఇరగదీశారు. ముఖ్యంగా జై బాలయ్య పాటలో అదరగొట్టారు.
ఈ పాటలో షర్ట్ లో చేంజ్ చేస్తూ బాలకృష్ణ వేసిన స్టెప్పు స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది. ఆ పాటలో బాలయ్య మూమెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. షర్ట్ లో చేంజ్ చేసే స్టెప్ ను ఇప్పుడు అందరు ట్రై చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఈ స్టెప్ వైరల్ అయ్యింది. తాజాగా అందాల భామ నివేద థామస్ కూడా ఈ స్టెప్ వేసి ఆకట్టుకుంది. షర్ట్స్ పైన షర్ట్స్ వేసుకొని స్టెప్ ట్రై చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ బాలయ్య స్టెప్పు వేయడం అంత ఈజీ కాదు. షర్ట్స్ కు దారాలు కట్టి ఆ స్టెప్ వేయడానికి ట్రై చేసింది వెనక ఆమె తమ్ముడు దారలా సాయంతో షర్ట్స్ ను వెనక్కి లాగుతూ మూమెంట్ ట్రై చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఫన్నీగా వున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫన్నీ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :