Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు.. హోస్ట్‌గా వ్యవహరించేది నాగ్‌ కాదా.. ఆ క్రేజీ యాంకరేనా.?

Bigg Boss Telugu: తెలుగు బుల్లతెర ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేసింది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. ఎక్కడో హాలీవుడ్‌లో పురుడు పోసుకున్న ఈ షో తెలుగులోనూ పాపులర్‌ కావడం అంటే అంత ఆశామాషీ..

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు.. హోస్ట్‌గా వ్యవహరించేది నాగ్‌ కాదా.. ఆ క్రేజీ యాంకరేనా.?
Follow us

|

Updated on: Dec 30, 2021 | 7:38 AM

Bigg Boss Telugu: తెలుగు బుల్లతెర ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేసింది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. ఎక్కడో హాలీవుడ్‌లో పురుడు పోసుకున్న ఈ షో తెలుగులోనూ పాపులర్‌ కావడం అంటే అంత ఆశామాషీ విషయం కాదు. అందుకుతగ్గట్లే ఈ షో తెలుగులో టీఆర్‌పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే 5వ సీజన్‌లో విన్నర్‌గా సన్నీని ప్రకటించిన వెంటనే నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. కేవలం రెండు నెలల్లోనే బిగ్‌బాస్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలల్లో రానుంది రెగ్యులర్‌ బిగ్‌బాస్‌ కాదని, ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అయ్యే బిగ్‌బాస్‌ అని తర్వాత క్లారిటీ ఇచ్చారు నిర్వాహకులు. హిందీలో వచ్చిన మాదిరిగానే 24*7 టెలికాస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇక ఇందులో కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. స్వయంగా నాగార్జునే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే బిగ్‌బాస్‌ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ సంస్థ అయిన ‘ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఓటీటీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌ బాధ్యత అంతా ఓంకార్‌దే అన్నమాట. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఎదురువతోంది.

Omkar

ఇది కేవలం బాధ్యతలకే పరిమితమవుతుందా.. లేదా హోస్ట్‌గా కూడా ఓంకార్‌ వ్యవహరించనున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హిందీలో కూడా బిగ్‌బాస్‌ రెగ్యులర్‌ షోకి సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తే.. ఓటీటీకి కరణ్‌ జోహర్‌ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. మరి తెలుగులో కూడా ఇలాంటి స్ట్రాటజీ ఏమైనా ఫాలో కానున్నారా.? అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.

Also Read: Thaman S: అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు..! ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్..(వీడియో)

PODCAST ON OMICRON: వామ్మో ఒమిక్రాన్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మూడో రూపం ఒమిక్రాన్‌..(వీడియో)

TRS Group War: రాములు వర్సెస్ మదన్ లాల్.. హీటెక్కిన వైరా వైరం.. ఆయన సపోర్ట్‌తోనే..