Coronavirus: ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్లు సునామీ సృష్టిస్తున్నాయి.. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన..

Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. ఒమిక్రాన్‌ రూపంలో..

Coronavirus: ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్లు సునామీ సృష్టిస్తున్నాయి.. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2021 | 9:29 AM

Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మాయదారి రోగం మరోసారి విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. ఒమిక్రాన్‌ రూపంలో ప్రపంచంపై దండెత్తడానికి వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా పరిస్థితులు చూస్తుంటే కరోనా థార్డ్‌ వేవ్‌ వచ్చేసిందా అన్న అనుమానులు రాకమానదు. ఓవైపు డెల్టా వేరియెంట్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయమై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనామ్‌ గెబ్రెయసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్‌ కేసులు కలిసి సునామీ సృష్టిస్తున్నాయి. పని భారంతో అలసిపోయిన వైద్య సిబ్బందిపై ప్రస్తుత పరిస్థితులు మరింత ఒత్తిడిని పెంచుతుందని గెబ్రెయసస్‌ తెలిపారు. ఇక ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువని ప్రాథమిక గణంకాలు సూచించినా.. అది నిజమనే తుది అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్‌పై తుది నిర్ణయానికి రావాలంటే మరింత విశ్లేషణ చేస్తేనే స్పష్టత రావొచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఒమిక్రాన్‌ ఇప్పటికే ప్రధాన వేరియెంట్‌గా మారగా… యూరప్‌లోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్‌ బాగా ప్రబలుతోంది.

Also Read: Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు.. హోస్ట్‌గా వ్యవహరించేది నాగ్‌ కాదా.. ఆ క్రేజీ యాంకరేనా.?

ICC Awards: టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ జాబితాలో చేరిన ‘ఆ నలుగురు’.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు